జూన్ 21న ప్రేక్షకుల ముందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల

ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ తరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో ఓ యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ఒక సినిమాని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ఆ సినిమాకి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది.

బ్లాక్ ఆంట్ పిక్చర్స్ అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ సినిమాలో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 21వ తేదీన ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సినిమా జూన్ 21 న రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది, సెన్సార్ పనులు కూడా పూర్తి అయిపోయాయి, సెన్సార్ బోర్డు వాళ్ళు సినిమా చూసి చాలా బాగుంది, విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, లవ్ స్టోరీ మనసుకు హత్తుకునే లా ఉంది అన్నారు, కచ్చితంగా మా సినిమా ని థియేటర్ లో చూసినప్పుడు ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు అని గట్టిగా నమ్ముతున్నాను అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శంకర్ పిక్చర్స్, సినిమా ని ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీస్ చేసిన టీసర్, మరియు రెండు పాటలు ట్రెండ్ అవుతున్నాయి, మా సినిమా ఖచ్చితంగా యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుందని, కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని నమ్ముతున్నాం అన్నారు.

నటీనటులు:
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల

సాంకేతిక వర్గం:
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
పాటలు: కార్తీక్ రోడ్రిగజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్
కొ డైరెక్టర్ : వంశీ ఉదయగిరి
పిఆర్ఓ: సురేష్ కొండేటి

Tfja Team

Recent Posts

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

3 days ago

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…

3 days ago

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

2 weeks ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

2 weeks ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

2 weeks ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

2 weeks ago