‘జీబ్రా’ నుంచి సత్యదేవ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ, ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్‌లో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ‘జీబ్రా’ అనే టైటిల్ తో రూపొందతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

పోస్టర్‌లో సత్యదేవ్‌ని సూట్‌లో స్టైలిష్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారు. అయితే తను ఇంటెన్స్ చూపులతో చాలా సీరియస్‌గా కనిపిస్తున్నారు. అతను భుజంపై బ్యాగ్ పట్టుకొని ఫెరోషియస్ గా నడుస్తూ కనిపించారు. మరో చేతిలో పెన్ను ఉంది. బ్యాక్ గ్రౌండ్ పోస్టర్ లో సత్యదేవ్, కరెన్సీ నోట్లను చూపించారు. సినిమాలో సత్యదేవ్ క్యారెక్టర్ ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది.

లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిక్కినాటో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు, ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సత్య ఆకల, సునీల్ ఇతర ముఖ్య తారాగణం.

కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, సత్య పొన్మార్ సినిమాటోగ్రాఫర్. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.

తారాగణం: సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచ్చినాటో, సత్య ఆకల, సునీల్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన , దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
ఎడిషినల్ స్క్రీన్ ప్లే: యువ
నిర్మాతలు: SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం
బ్యానర్లు: పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్
సహ నిర్మాత: ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి
డీవోపీ: సత్య పొన్మార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: అనిల్ క్రిష్
డైలాగ్స్: మీరాఖ్
స్టంట్స్: సుబ్బు
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

10 hours ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

12 hours ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

12 hours ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

12 hours ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

12 hours ago

‘దేఖ్‌లేంగే సాలా’ పాటతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్

శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…

12 hours ago