టాలీవుడ్

ఘనంగా “హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “హనీమూన్ ఎక్స్ ప్రెస్”. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు కేఎల్ ప్రసాద్ మాట్లాడుతూ – హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా కంటెంట్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఈతరం ప్రేక్షకులు బాగా ఇష్టపడే సినిమాలా ఉండబోతోంది. హీరో హీరోయిన్స్ చైతన్య రావ్, హెబ్బా పటేల్ కు, డైరెక్టర్ బాల కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

గాయకుడు దీపు మాట్లాడుతూ – హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ గారికి థాంక్స్. ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి. నేను ఈ మూవీలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. అన్నారు.

సింగర్ స్ఫూర్తి జితేందర్ మాట్లాడుతూ – హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో తెలుగు, స్పానిష్ సాహిత్యం కలిపి ఒక కొత్త తరహా పాటను నేను పాడాను. ఈ పాట తెలుగు శ్రోతలకు కొత్త అనుభూతిని ఇస్తుంది. దర్శకుడు బాల గారు మా నాన్న ఫ్రెండ్స్. నేను స్పానిష్ సాంగ్స్ రాయడం బాల గారికి తెలుసు. అలా నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో సినిమా మా టీమ్ అందరికీ బిగ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ – దర్శకుడు బాల రాజశేఖరునితో నాకు మంచి మిత్రుడు. ఆయన హాలీవుడ్ లో బ్లైండ్ యాంబిషన్, గ్రీన్ కార్డ్ ఫీవర్ అనే మూవీస్ చేశాడు. ఇప్పుడు టాలీవుడ్ కు వచ్చి హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రూపొందించారు. హీరో చైతన్య రావ్ నాకు మంచి ఫ్రెండ్. ఈ మూవీకి కల్యాణి మాలిక్ మంచి సాంగ్స్ ఇచ్చారు. ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాను మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ – నేను యూఎస్ లో ఉన్నప్పుడు మా ఫేవరేట్ డైరెక్టర్స్ ను ఈమెయిల్స్ ద్వారా సంప్రదించేవాడిని. అలా డైరెక్టర్ బాల గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన మూవీకి పనిచేయాలని ఉందని అడిగాను. బాల గారు రూపొందించిన బ్లైండ్ యాంబిషన్ సినిమాకు ఒక షెడ్యూల్ అయ్యాక జాయిన్ అయ్యాను. అలా నేను ఫస్ట్ నేను వర్క్ చేసిన మూవీ ఆయనదే. స్క్రిప్ట్ రైటింగ్ లో మంచి బుక్స్ ను బాల నాకు సజెస్ట్ చేసేవారు. అలా స్క్రిప్ట్ రైటింగ్ లోనూ అవగాహన తెచ్చుకున్నా. బాల తెలుగులో తన తొలి సినిమాను హనీమూన్ ఎక్స్ ప్రెస్ పేరుతో చేయడం సంతోషంగా ఉంది. నేను మొదట్లో దర్శకుడిగా సినిమా చేసేప్పుడు ఆయన సలహాలు తీసుకునేవాడిని. బాల గారి ఫస్ట్ తెలుగు సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ – హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేసిన గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాతో ఎగ్జైటింగ్, ఇంట్రెస్టింగ్ జర్నీ చేశాము. ఈ నెల 21న హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ కు వస్తోంది. మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

ఆర్ట్, సినిమాటోగ్రఫీ శిష్ట్లా  వి ఎమ్ కె మాట్లాడుతూ – దర్శకుడు బాల నేను చెప్పాలనుకునే పాయింట్స్ అన్నీ చెప్పేశారు. నాకు మంచి ఫ్రెండ్ అయిన బాలతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ – హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి బ్లెస్ చేసిన అతిథులు అందరికీ థ్యాంక్స్. మా మూవీకి నాగార్జున గారు, అమల గారు, రాఘవేంద్రరావు గారు, ఆర్జీవీ గారు, విజయేంద్రప్రసాద్ గారు..ఇలా చాలామంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. నాగార్జున గారు ముందు ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రమోషన్ కు అమలగారు ముందుకొచ్చారు. వారు ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తో హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా సక్సెస్ ఫుల్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. మనదేశం నుంచి దూరంగా ఉంటూ రావడం వల్ల ఇక్కడి ప్రజలను, కల్చర్ ను మిస్ అయ్యాను. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా నేను తిరిగి మన దగ్గరకు వచ్చేందుకు ఒక వెహికిల్ లా ఉపయోగపడింది. స్టార్ హోటల్స్ లో మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవచ్చు కానీ నేను ప్రసాద్ ల్యాబ్స్ నే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా లెగసీని కొనసాగిస్తున్న ప్లేస్. ఇక్కడే వేలాది సినిమాలు తయారయ్యాయి. ఆ చరిత్రలో మా హనీమూన్ సినిమా కూడా భాగమవ్వాలనే ప్రసాద్ ల్యాబ్స్ ను మా సినిమా ప్రీ రిలీజ్ వేడుక చేస్తున్నాం. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా రూపొందించాం. 30 వెడ్స్ 21 చైతన్య రావ్ ను, కుమారి 21 ఎఫ్ హెబ్బా పటేల్ ను జంటగా ఈ మూవీలో చూపించడమే ప్రత్యేకత. చైతన్య రావ్ కు, హెబ్బా పటేల్ కు డిఫరెంట్ ఇమేజ్ లు ఉన్నాయి. వారి జంట ఈ మూవీలో ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తుంది. వంద కోట్ల సినిమా అయినా పది కోట్ల రూపాయల సినిమా అయినా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. అప్పట్లో టైటానిక్ మూవీతో పాటు ది ఫుల్ మాంటీ అనే స్మాల్ బడ్జెట్ మూవీ రిలీజైంది. టైటానిక్ సినిమాను ఎంతమంది చూశారో, అంతే సంఖ్యలో ప్రేక్షకులు ది ఫుల్ మాంటీ చూశారు. కానీ లాభాలు ది ఫుల్ మాంటీ సినిమాకే ఎక్కువ వచ్చాయి. టైటానిక్ మేకర్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. థియేటర్ లోకి వెళ్లాక ఒక ప్రేక్షకుడిని మెప్పించేది కంటెంట్ మాత్రమే. అలాంటి మంచి కంటెంట్ మా హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీలో ఉంది. కల్యాణి మాలిక్ పాటలు బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ నెల 21న మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా వస్తున్నాం. మా సినిమాకు మీ ఆదరణ దక్కుతుందని కోరుకుంటున్నా.  అన్నారు.

రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ జంట చైతన్య రావ్, హెబ్బా పటేల్ బాగున్నారు. దర్శకుడు బాల మంచి డైరెక్టర్. హాలీవుడ్ లో మూవీస్ చేశాడు. ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. అతనితో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – ప్రతి నటుడికి అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలనే కోరిక ఉంటుంది. నాకు అలాంటి అవకాశం హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా దక్కింది. దర్శకుడు బాల గారిలో హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉంటుంది. ఈ సినిమాలోనూ అది కనిపిస్తుంది. డైరెక్టర్ బాల ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడే హ్యాపీగా ఫీలయ్యా. లవర్స్, పెళ్లి చేసుకోబోయే వాళ్లు, పెళ్లి చేసుకున్నకొత్త జంట, పెళ్లై ఇరవై ఏళ్లయిన జంటలు ప్రతి ఒక్కరికీ నచ్చేలా హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఉంటుంది. వాళ్లందరికీ రిలేట్ అయ్యే అంశాలుంటాయి. అలాగని ఈ సినిమాలో సందేశం చెప్పడం లేదు. ఎంటర్ టైనింగ్ గా సినిమాను రూపొందించారు మా దర్శకుడు. హెబ్బాతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణి మాలిక్ గారు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. మా మూవీ సాంగ్స్ నా ఫేవరేట్ అయ్యాయి. మా డీవోపీ శిస్ట్లా నాకు ఎన్నో కొత్త విషయాలు నేర్పించారు. ఈ సినిమా మేకింగ్ క్రమంలో నాకు మంచి ఫ్రెండ్ గా మారారు. ఈ రోజు మా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ కు థ్యాంక్స్. ఈ నెల 21న హనీమూన్ ఎక్స్ ప్రెస్ థియేటర్స్ లోకి వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్, తదితరులు గెస్ట్ లుగా పాల్గొన్నారు.
సమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA))
బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd)
చిత్రం పేరు : హనీమూన్ ఎక్స్‌ప్రెస్

నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు

సంగీతం : కళ్యాణి మాలిక్  
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్
లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ
ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా  వి ఎమ్ కె
ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి
ఆడియో : టి సిరీస్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)
రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని

Tfja Team

Recent Posts

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…

56 minutes ago

Thanks Vinayak For Launching Teaser Of Barabar Premistha

The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…

56 minutes ago

Deccan Sarkar Movie Poster and Teaser Launch

Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…

2 hours ago

‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…

2 hours ago

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…

2 hours ago

Second Schedule of Sci-Fi Action Killer has been wrapped up

Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…

2 hours ago