ఘనంగా అల్లు శిరీష్ “బడ్డీ” సినిమా ట్రైలర్ లాంఛ్

Must Read

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఎడిటర్ రూబెన్ మాట్లాడుతూ – బడ్డీ సినిమాకు వర్క్ చేయడం కష్టంగానే అనిపించింది. ఎడిటింగ్ టేబుల్ పై నేను దర్శకుడు శామ్ రోజూ డిస్కస్ చేసుకునేవాళ్లం. ఇదొక డిఫరెంట్ మూవీ. బడ్డీ లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో మంచి కాస్టింగ్ ఉంది. వాళ్లతో పాటు మూవీలో బడ్డీది ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇలాంటి కొత్త తరహా సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారికి అభినందనలు. మా మూవీ మిమ్మల్ని డిజప్పాయింట్ చేయదు. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.

రైటర్ సాయి హేమంత్ మాట్లాడుతూ – నేను చిన్నప్పుడు యముడు, నా పేరు శివ సినిమాల్లో కేఈ జ్ఞానవేల్ రాజా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అని చూసేవాడిని. ఇదేదో కొత్తగా ఉందని అనిపించేది. ఇవాళ ఆయన తెలుగులో ప్రొడ్యూస్ చేసిన సినిమాకు నేను రైటర్ ను కావడం నాకు గర్వంగా ఉంది. ఈ సినిమాలో గుర్తుండే డైలాగ్స్ చాలా ఉన్నాయి. బడ్డీ చెప్పే ప్రతి డైలాగ్ పంచ్ లా పేలుతుంది. డైరెక్టర్ శామ్ గారు మరిన్ని తెలుగు సినిమాలు చేయాలి, ఆ సినిమాలకు నేను వర్క్ చేయాలని కోరుకుంటున్నా. మా శిరీష్ గారిని కెప్టెన్ అని పిలుస్తాను. ఆయన కెరీర్ లో టిల్ డేట్ ది బెస్ట్ మూవీ బడ్డీ అని చెప్పగలను. అన్నారు.

నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ – హైదరాబాద్ లోని మీడియా మిత్రులను, తెలుగు ఆడియెన్స్ ను, ఇక్కడి మంచి ఫుడ్ ను మిస్ అవుతుంటాను. మీరంతా ఎన్నో ఏళ్లుగా మా స్టూడియో గ్రీన్ సంస్థను ఆదరిస్తున్నారు. మా మూవీస్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మా ప్రోగ్రాం హోస్ట్ చేస్తున్న ఆధ్య శ్రేయాస్ శ్రీనివాస్ వాళ్ల పాప. తను బాగా హోస్టింగ్ చేస్తోంది. సుమ గారి ఈవెంట్స్ నెంబర్ ఆధ్య క్రాస్ చేయాలని కోరుకుంటున్నా. గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్ కలిసి శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రమ్ సినిమాను తమిళంలో రీమేక్ చేశాం. ఆ సినిమాలో జీవీ ప్రకాష్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేశాం. సంక్రాంతికి రిలీజైన ఆ సినిమా తమిళంలో మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు బడ్డీ మూవీ చేస్తున్నాం. ఈ చిత్రంలో అలీ, అజ్మల్ బాగా సపోర్ట్ చేశారు. శామ్ బడ్డీతో మా సంస్థకు మరో మంచి సినిమా ఇస్తున్నాడు. నేను ఈ కథ కంటే శామ్ ను ఎక్కువ నమ్మాను. ఎడిటర్ రూబెన్, సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ ప్రేమకథా చిత్రమ్ రీమేక్ తర్వాత మరోసారి మా సంస్థలో పనిచేస్తున్నారు. రూబెన్ పుష్ప, జవాన్ సినిమాలకు వర్క్ చేశారు. హిప్ హాప్ తమిళ మా బడ్డీ మూవీకి బ్యాక్ బోన్. ఆయన సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోయారు. ఫైట్ మాస్టర్ శక్తి శరవణన్ ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్సులు చేశారు. మా కంగువ మూవీ వీఎఫ్ఎక్స్ కు వర్క్ చేసిన హరిహర సుతన్ బడ్డీకి కూడా పనిచేశారు. విజువల్ ఎఫెక్టులు న్యాచురల్ గా ఉంటాయి. హీరోయిన్స్ గాయత్రి, ప్రిషా లకు వాళ్ల కెరీర్ లో ఇంపార్టెంట్ ఫిలిం అవుతుంది. అల్లు శిరీష్ మా కుటుంబ సభ్యుడు లాంటి వారు. ఆయన ఫేవరేట్ హీరో సూర్య. మా జర్నీలో గుడ్ బ్యాడ్ టైమ్స్ లో శిరీష్ సపోర్ట్ గా ఉన్నారు. ఆయన థ్యాంక్స్ చెబుతున్నా. బడ్డీ సినిమా ఫుటేజ్ కొంతమందికి చూపించాను. శిరీష్ బడ్డీలో బాగా కనిపించారు, బాగా నటించారు అని వాళ్లు చెప్పారు. మధుర శ్రీధర్ గారు మా ఆవారా సినిమా టైమ్ నుంచి పరిచయం. ఆవారా సాంగ్స్ మధుర ఆడియోలో రిలీజ్ చేశాం. అప్పటి నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ గా ఉన్నారు. శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. జూలై 26న బడ్డీ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేసి బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – నా ఫ్రెండ్ జ్ఞానవేల్ రాజా ఎన్నో తమిళ చిత్రాలను తెలుగులోకి తీసుకొచ్చి సక్సెస్ అందుకున్నారు. బడ్డీతో ఆయన స్ట్రైట్ తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది. అల్లు శిరీష్ కొత్త తరహా కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. మేము ఆయనతో ఏబీసీడీ అనే సినిమా చేశాం. జ్ఞానవేల్ రాజా, శిరీష్ బడ్డీ సినిమాకు కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. కొత్త తరహా చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు బిగ్ ఓపెనింగ్స్ ఇచ్చి ఆదరిస్తారు. జూలై 26న బడ్డీ సినిమాకు ఆ సపోర్ట్ దక్కుతుందని ఆశిస్తున్నా. దర్శకుడు శామ్ వర్క్ చాలా బాగుంటుంది. అందరితో టీమ్ వర్క్ చేయిస్తాడు. ఆయన మరిన్ని తెలుగు సినిమా చేయాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ మాట్లాడుతూ – బడ్డీ సినిమా ట్రైలర్ ను మీ అందరి ముందు రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి వర్క్ చేయడం మా అందరికీ కొత్త ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. బడ్డీ సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుంది. బడ్డీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఊహించుకుంటూ విజువల్స్ క్యాప్చర్ చేశారు. విజువల్ ఎఫెక్టుల ప్రాధాన్యత ఉంటే చిత్రమిది. ప్రేక్షకులకు బడ్డీ సినిమా న్యూ ఫీల్ కలిగిస్తుంది. అన్నారు.

హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ – బడ్డీ సినిమా కథను దర్శకుడు శామ్ చెప్పినప్పుడే ఇదొక స్పెషల్ ఫిల్మ్ అవుతుందని నమ్మాను. ఈ కథ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా ఉంటుంది. డైరెక్టర్ శామ్, రైటర్ హేమంత్ కలిసి మరింత ఇంట్రెస్టింగ్ గా స్క్రిప్ట్ చేశారు. పిల్లలు పెద్దలు యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అల్లు శిరీష్ మంచి కోస్టార్. ఆయన నుంచి యాక్టింగ్ పరంగా చాలా విషయాలు నేర్చుకున్నాను. బడ్డీని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

హీరోయిన్ ప్రిషా రాజేశ్ సింగ్ మాట్లాడుతూ – స్టూడియో గ్రీన్ లాంటి బిగ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ మూవీ హీరోయిన్ గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు శామ్ ఆంటోన్ కు థ్యాంక్స్. శిరీష్ మంచి కోస్టార్. అతనితో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. సినిమాలో శిరీష్ కెప్టెన్ ఆదిత్యరామ్ గా కనిపిస్తారు. నాకు శిరీష్ కంటే ఆదిత్యరామ్ క్యూట్ గా కనిపించాడు. బడ్డీ మూవీ మీ అందరికీ నచ్చుతుంది. థియేటర్ చూసి రెస్పాన్స్ చెప్పండి. అన్నారు.

యాక్టర్ అజ్మల్ మాట్లాడుతూ – స్టూడియో గ్రీన్ సంస్థలో ఇప్పటికే నేను ఒక సినిమా చేయాల్సింది. ఆ మూవీ అనివార్య కారణాలతో చేయలేకపోయాను. ఈ మూవీకి జ్ఞానవేల్ గారు ఫోన్ చేసి పిలిచినప్పుడు హ్యాపీగా అనిపించింది. నేను విలన్ రోల్స్ చేసి విసిగిపోయాను. ఈ సినిమాలో అలాంటి ఉండొద్దని కోరుకున్నా. డైరెక్టర్ శామ్ చెప్పిన ప్రతి డైలాగ్ నచ్చింది. సాయి హేమంత్ చెప్పిన స్క్రిప్ట్ కు గూస్ బంప్స్ వచ్చాయి. వెంటనే ఈ మూవీ చేస్తున్నానని చెప్పాను. గాయత్రి, ప్రిషా గుడ్ యాక్ట్రెసెస్. అల్లు శిరీష్ తో ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. ఆయనతో ఎదురుగా నిల్చుని ఫైట్ చేస్తున్నప్పుడు నా ముందు టామ్ క్రూయిజ్ ఉన్నట్లు అనిపించేది. ఈ క్యారెక్టర్ కోసం శిరీష్ తనను తాను మార్చుకుని తీరు బాగా నచ్చింది. జూలై 26న బడ్డీని థియేటర్ లో మీరంతా లవ్ చేస్తారు. అని చెప్పారు.

నటుడు అలీ మాట్లాడుతూ – దర్శకుడు శామ్ నాకు ఈ సినిమా గురించి ఫోన్ చేసినప్పుడు తమిళ్ మూవీ అనుకున్నా. శిరీష్ గారు హీరో అని చెప్పారు. ఈ సినిమాలో బడ్డీ చాలా స్పెషల్ గా ఉంటుంది. బడ్డీ క్యారెక్టర్ ను పిక్చరైజ్ చేసేప్పుడు దర్శకుడు చాలా ప్రతిభావంతంగా వర్క్ చేశారు. బడ్డీ అంత ఎత్తున్న వ్యక్తిని అక్కడ పెట్టి షూట్ చేసేవాళ్లు. మేము థాయ్ లాండ్ షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడ జపనీస్, చైనీస్ వాళ్లు బడ్డీతో ఫొటోస్ తీసుకునేవారు. ఈ సినిమాను జపాన్, చైనాలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా సక్సెస్ అవుతుంది. బడ్డీ సినిమాకు బాగా డబ్బులు రావాలి, సీక్వెల్ చేసేంత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు శామ్ ఆంటోన్ మాట్లాడుతూ- జ్ఞానవేల్ రాజా గారి ప్రొడక్షన్ లో డార్లింగ్ మూవీ చేశాను. అది నా మొదటి సినిమా. ఫస్ట్ మూవీ నుంచే నాపై జ్ఞానవేల్ రాజా గారికి నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం డిస్కషన్ జరిగినప్పుడు నన్ను స్క్రిప్ట్ కూడా అడగలేదు. కేవలం నా మీద నమ్మకంతో ఈ మూవీ ఇచ్చారు. సీజీ అయ్యాక ఫైనల్ వెర్షన్ సినిమా చూశారు. జ్ఞానవేల్ గారికి బడ్డీ సినిమా నచ్చింది. ఆయన తర్వాత నా మీద నమ్మకం ఉంచిన మరో పర్సన్ శిరీష్ గారు. ఆయన నేను చెప్పిన ఐడియాస్ కు చాలా బాగున్నాయని ఎంకరేజ్ చేశారు. నేను డైరెక్టర్ రాజమౌళి గారి ఫ్యాన్ ను. ఆయన చేసిన ఈగ సినిమా ఈ బడ్డీ మూవీకి ఇన్సిపిరేషన్. బడ్డీకి సీజీ వర్క్ చేసినప్పుడు ఈగ మూవీతో పోల్చి సజెషన్స్ చెప్పేవాడిని. బడ్డీ మూవీకి వర్క్ చేసిన అజ్మల్, అలీ, హీరోయిన్స్, ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. మా మూవీని సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ – లాస్ట్ ఇయర్ బడ్డీ పోస్టర్ రిలీజైనప్పుడు మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నావా అని అడిగారు. ఓటీటీలో ఇలాంటి సినిమా ఉందని చెప్పారు. నేను వారికి ఎన్ని చెప్పినా అనేది అనుకుంటారు అని వదిలేశా. బడ్డీ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది. టెడ్డీ బేర్ తో అడ్వెంచర్ యాక్షన్ మూవీ, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. కానీ ఇవాళ బడ్డీ ట్రైలర్ చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కొత్త తరహా సినిమా ఎప్పుడు వచ్చినా మన ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్ టైప్ మూవీ కాదు. కొత్తగా ఉంటుంది. శామ్ గారి 100 అనే సినిమా చూసి చాలా బాగా చేశాడే అనుకున్నా. అలాగే శామ్ గారి ట్రిగ్గర్ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను. రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న అథర్వాతో యాక్షన్ మూవీ చేశాడు అనుకున్నా. నేను శామ్ కు ఫోన్ చేసి మాట్లాడాను. మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు సినిమా చేద్దామని అన్నా. బడ్డీతో మా కాంబో కుదిరింది. ఈ సినిమాలో హీరో నేను కాదు టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్ కు ఇంప్రెస్ అయ్యే నేనీ సినిమా చేశా. నా హీరోయిజం చూపించాలని కాదు. జ్ఞానవేల్ గారికి థ్యాంక్స్. మా నాన్న కూడా నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయలేదు. నాతో భారీ ఖర్చుతో బిగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేశారు జ్ఞానవేల్ గారు. పుష్ప 2 గురించి నేను ఇప్పుడు మాట్లాడను. మాట్లాడితే మరింత హైప్ క్రియేట్ చేస్తారు. టీజర్, ట్రైలర్ చూసి మీరే డిసైడ్ చేసుకోవాలి. అన్నారు.

నటీనటులు – అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ – రూబెన్
సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
ఆర్ట్ డైరెక్టర్ – ఆర్ సెంథిల్
మ్యూజిక్ – హిప్ హాప్ తమిళ
బ్యానర్ – స్టూడియో గ్రీన్ ఫిలింస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
ప్రొడ్యూసర్ – కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – శామ్ ఆంటోన్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News