క్రైమ్ రీల్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను : నటుడు సముద్రఖని !!!

Must Read

అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రైమ్ రీల్. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే ఈ సినిమాతో దర్శకురాలిగా మారడం విశేషం.

ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సముద్రఖని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రైమ్ రీల్ సినిమా మంచి విజయం సాధించాలి, సంజన అన్నే దర్శకురాలిగా ప్రతిభ చూపించాలని, కొత్త కాన్సెప్ట్ తో రానున్న ఈ క్రైమ్ రీల్ అందరిని అలరించాలని కోరుకుంటున్నాను, ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి, సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు.

సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భరత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. బాబు కొల్లాబతుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన అన్నే.

సోషల్ మీడియా వల్ల యువత ఎలా చెడిపోతున్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగింది, అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్ తో క్రైమ్ రీల్ సినిమాను డైరెక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది. మా సినిమా ట్రైలర్ సముద్రఖని గారి చేతుల మీదుగా విడుదల అవ్వడం , ఆయన మా సినిమాను ఆశీర్వదించడం ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకురాలు సంజన అన్నే తెలిపారు.

Latest News

హీరోలు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో...

More News