రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ అనేక ఆకర్షణలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా సందడి చేస్తోంది. ప్రాజెక్ట్ K అత్యంత ఖరీదైన ఇండియన్ సినిమా, ఇండియన్ సూపర్ స్టార్స్ ఈ చిత్రంలో అలరించనున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, ప్రభాస్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు.
ప్రాజెక్ట్ K శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రం. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ అక్కడ జరిగే ఈవెంట్ లో భారత ప్రామాణిక కాలమానం( (IST) ప్రకారం జూలై 20న అమెరికాలో, జూలై 21న ఇండియాలో విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లు పిడికిలి షేక్ చేయడం కనిపిస్తోంది.
ఈ వేడుకకు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు.
‘ప్రాజెక్ట్ K’ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న బహుభాషా సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఈ చిత్రంతో సినిమా నిర్మాణ చరిత్రలో వైజయంతీ మూవీస్ సక్సెస్ ఫుల్ గా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. చాలా మంది సూపర్‌స్టార్లు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు కలిసి పనిచేస్తున్న ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను దేశం ఎన్నడూ చూడలేదు.
దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది.
ప్రాజెక్ట్ K జనవరి 12, 2024న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…