కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.. OMG (ఓ మంచి ఘోస్ట్)

వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవిన్ నేని, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్). మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

దర్శకుడు శంకర్ మార్తాండ్ మాట్లాడుతూ.. ‘ఈ మూవీ స్క్రిప్ట్స్, డైలాగ్స్‌‌లో సహాయం చేసిన నా డైరెక్షన్ టీంకి, మత్తు వదలరా డైరెక్టర్ రితేష్ రానా గారికి థాంక్స్. మా నిర్మాత ఫాదర్ రాధాకృష్ణ గారికి థాంక్స్. అనూప్ రూబెన్స్ గారి వల్లే ఈ సినిమా ప్రారంభం అయింది. మా మీదున్న నమ్మకంతో అబినికా ఈ సినిమాను నిర్మించారు. సెట్స్ మీద మేం ఏం అడిగినా ఇచ్చారు. అలాంటి నిర్మాతలు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. అనూప్ గారు ఆర్ఆర్ ఇచ్చిన తరువాత సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. మా ఆర్టిస్టులంతా కూడా అద్భుతంగా నటించారు. ఆండ్రూ గారి కెమెరా వర్క్ బాగుంటుంది. ఫైట్ మాస్టర్ గారు తక్కువ టైంలోనే మాకు కావల్సిన అవుట్ పుట్ ఇచ్చారు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంటుంది. మా సినిమాను రిలీజ్ చేస్తున్న ఏసియన్ ఫిల్మ్స్, బాలాజీ ఫిల్మ్స్‌కి థాంక్స్. మా చిత్రం జూన్ 21న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నిర్మాత డా.అబినికా ఇనాబతుని మాట్లాడుతూ.. ‘నిర్మాతగా ఇది మాకు మొదటి చిత్రం. శంకర్ గారు ఎంత బాగా కథ చెప్పారో.. అంతకు మించి అనేలా సినిమాను తీశారు. అందరూ చూడదగ్గ చిత్రమిది. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి’ అని అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ‘ముందుగా ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తుండటం ఆనందంగా ఉంది. కరోనా టైంలో శంకర్ నాకు ఈ కథను చెప్పారు. అప్పుడు చిన్నగా అనుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సినిమా అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్, నందిత, షకలక శంకర్ మధ్య సీన్లు బాగా వచ్చాయి. హారర్, కామెడీ మిక్స్ చేసి బాగా తీశారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

నందితా శ్వేత మాట్లాడుతూ.. ‘నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. శంకర్ గారు నాకు ఈ కథను చెప్పినప్పటి నుంచి షూటింగ్ కోసం ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నాను. స్టోరీ నెరేట్ చేస్తూ ఉంటే నవ్వుతూనే ఉన్నాను. హారర్, కామెడీ జానర్లతో రాబోతున్న ఈ మూవీని కుటుంబ సమేతంగా చూడొచ్చు. అందర్నీ నవ్వించేలా మా సినిమా ఉంటుంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఓ మంచి ఘోస్ట్ సినిమా షూటింగ్‌ను మేం అంతా సరదాగా చేశాం. ఈ మూవీ అవుట్ పుట్ కూడా అలానే వచ్చింది. అందరికీ నచ్చేలానే ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.

నవమి గాయక్ మాట్లాడుతూ.. ‘నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఆండ్రూ సర్ మా అందరినీ బాగా చూపించారు. అనూప్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నందిత గారు నాకెంతో సపోర్ట్ ఇచ్చారు. మా చిత్రం జూన్ 21న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నటుడు నవీన్ నేని మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్. సెట్స్‌లో అల్లరి చేస్తూ షూటింగ్ చేశాం. ఎంతో సరదాగా సినిమా షూటింగ్‌ను చేశాం. మూవీ ఎంతో బాగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు.

రజత్ రాఘవ్ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. మా కెమెరామెన్ ఆండ్రూ గారు అద్భుతంగా తీశారు. సుబ్బు గారి ఫైట్స్, అనూప్ గారి ఆర్ఆర్ అదిరిపోతుంది. వెన్నెల కిషోర్, నందిత, షకలక శంకర్, నవీన్ ఇలా అందరితో నటించడం ఆనందంగా ఉంది. ఎంత నవ్వుతారో అంతగా భయపడతారు. జూన్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

ఘనంగా ప్రారంభమైన ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ చిత్రం

హైదరాబాద్:ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్…

1 hour ago

ఏఐ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న ‘అంబ’s రివెంజ,

▪️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ▪️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభంహైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో…

1 hour ago

మురళీ శర్మ ఓటీటీ ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ ‘సూపర్ సుబ్బు’తో ప్రేక్షకుల ముందుకు

జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు,…

6 hours ago

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి, టీడీ జనార్ధన్ ఓ అరుదైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు – మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు.

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక…

8 hours ago

బిలియన్ వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించిన బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా జయ జానకి నాయక.

భద్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రం సంచలనం…

1 day ago

శివాజీ బర్త్ డే స్పెషల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోన్న విలక్షణ నటుడు

తెలుగు సినిమా లోకానికి, తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శివాజీ. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన…

1 day ago