టాలీవుడ్

‘కల్కి 2898 AD’ లో పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్.

నాగ్ అశ్విన్ ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్. కల్కి ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు: ఉలగ నాయగన్ కమల్ హాసన్ 

అమితాబ్ బచ్చన్ సర్, కమల్ సర్ లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేయడం.. ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం: రెబల్ స్టార్ ప్రభాస్ 

కల్కి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కంప్లీట్ న్యూ వరల్డ్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇది: హీరోయిన్ దీపికా పదుకొణె

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’, విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. ‘భైరవ అంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్ లో వుంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ముంబై లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కల్కి టీంతో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.  

ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. కల్కి 2898 AD’ లో పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్. ట్రూలీ వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఇది ఓ కొత్త ప్రపంచం. ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి సినిమాని అలోచించిన నాగ్ అశ్విన్ కి, టీం అందరికీ అభినందనలు. నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఏం డ్రింక్ చేస్తే ఇలాంటి కథని అలోజించగలిగాడనిపించింది. ఇందులో వున్న విజువల్స్ అన్ బిలివబుల్. ఇలాంటి ఫ్యుచరిస్టిక్ ప్రాజెక్ట్ ని తీయడం మహా అద్భుతం. తను అనుకున్న విజన్ ని వండర్ ఫుల్ గా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. కల్కి ఎక్స్ పీరియన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను’ అన్నారు     

ఉలగ నాయగన్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్ మా గురువు గారు బాలచందర్ గారిలా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు నాగ్ అశ్విన్ కి వుంది. ఇందులో బ్యాడ్ మ్యాన్ గా ప్లే చేస్తా. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు’ అన్నారు      

రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దత్తు గారు, నాగీ గారికి థాంక్ యూ. ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం. అమితాబ్ గారు కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ గారి లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి కడుపులో క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. అలాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం అన్ బిలివబుల్. అలాగే దీపిక ఇంటర్నేషనల్ లెవల్ కి రీచ్ అయిన స్టార్. దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్ యూ’ అన్నారు.

హీరోయిన్ దీపికా పదుకొనే మాట్లాడుతూ.. కల్కి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కంప్లీట్ న్యూ వరల్డ్. డైరెక్టర్ నాగీ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇది. యాక్టర్ గా ప్రొఫెషనల్ గా ఇది అద్భుతమైన ఎక్స్ పీరియన్స్. నాగీ జీనియస్. తన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. సినిమాని అద్భుతంగా తీశారు’ అన్నారు  

ప్రొడ్యూసర్ అశ్విని దత్ మాట్లాడుతూ.. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్, దీపిక నలుగురూ ఇక్కడ వుండటం, అందరి సమక్షంలో ఈ ఈవెంట్ జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘కల్కి 2898 AD’ యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago