ఈ నెల 20న హీరో ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా” ట్రైలర్ రిలీజ్

Must Read

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం.

ఈ నెల 31న “గం..గం..గణేశా” సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు “గం..గం..గణేశా” సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మంచి క్రైమ్ కామెడీ మూవీగా..ప్రేక్షకులు ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉండబోతోంది.

నటీనటులు :
ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.

టెక్నికల్ టీమ్ :

పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ
ఆర్ట్: కిరణ్ మామిడి
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
సంగీతం – చేతన్ భరద్వాజ్
లిరిక్స్ – సురేష్ బనిశెట్టి
బ్యానర్ – హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్
కొరియోగ్రఫీ: పొలాకి విజయ్
కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని
నిర్మాతలు – కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
రచన, దర్శకత్వం – ఉదయ్ శెట్టి

Latest News

జూన్ 27న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు ‘కన్నప్ప’

డైనమిక్ హీరో విష్ణు మంచు గత ఏడాది ‘కన్నప్ప’ అంటూ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ‘కన్నప్ప’...

More News