‘ఆయ్’ నుంచి రెండో పాట ‘రంగనాయకి’ విడుదల

GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కంచిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ నుంచి రెండో పాట ‘రంగనాయకి’ విడుదల

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

ఆయ్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వస్తుంది.  టైటిల్ రివీల్ సహా సినిమా కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు, పోస్ట‌ర్స్‌, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో శ‌నివారం మేక‌ర్స్ ఈ మూవీ నుంచి ‘రంగనాయకి’ అనే మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సాంగ్ ప్రోమోతో పాట‌పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా విడుద‌లైన లిరిక‌ల్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను మ‌రింతంగా ఆక‌ట్టుకుంటోంది. మాస్ బీట్‌తో ఉన్న ఈ పాట‌ను వింటుంటే స్టెప్స్ వేయాల‌నిపించేలా ఉంది.

ప్ర‌స్తుతం సూప‌ర్ హిట్ పాట‌ల‌కు కేరాఫ్‌గా మారిన రామ్ మిర్యాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌టం విశేషం. సురేష్ బనిశెట్టి రాసిన ఈ పాటను మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. భాను మాస్టర్ నృత్య రీతుల‌ను స‌మ‌కూర్చారు. సెట్స్‌, ఆర్టిస్టుల డ్రెస్సింగ్ చాలా కల‌ర్‌ఫుల్‌గా ఉంది. న‌య‌న్ సారిక కూడా ఈ పాట‌లో క‌నిపించింది.

 నితిన్‌, న‌య‌న్ సారిక జోడి సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ చ‌క్క‌గా ఉంది. ఈ సాంగ్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు.
‘ఆయ్’ సినిమాను ప్రారంభం నుంచి సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్‌ను నింపుతోంది. ఈ డిఫరెంట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.  త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

GA2 పిక్చర్స్:

 ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

నటీనటులు:  నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ – GA2 పిక్చర్స్, సమర్పణ – అల్లు అరవింద్, నిర్మాతలు – బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, డైరెక్టర్ – అంజి కె.మ‌ణిపుత్ర‌, సహ నిర్మాతలు – భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, సినిమాటోగ్రఫీ – సమీర్ కళ్యాణి, సంగీతం – రామ్ మిర్యాల, ఎడిటర్ – కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అజయ్ గద్దె, కాస్ట్యూమ్స్ – సుష్మిత, శిల్ప, కో డైరెక్టర్ – రామ నరేష్ నున్న
పి.ఆర్.ఒ – వంశీ కాకా, మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట, పోస్టర్స్ – అనిల్, భాను.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago