ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న “తంగలాన్”

Must Read

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. “తంగలాన్” చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన “తంగలాన్” సినిమా ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘మనకి మనకి..’ లిరికల్ సాంగ్ కూడా ఛాట్ బస్టర్ అయ్యింది. రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడం “తంగలాన్” మూవీ మీద ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. “తంగలాన్” ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగించనుంది.

నటీనటులు – చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు

టెక్నికల్ టీమ్

సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్
ఆర్ట్ – ఎస్ ఎస్ మూర్తి
ఎడిటింగ్ – ఆర్కే సెల్వ
స్టంట్స్ – స్టన్నర్ సామ్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్స్ – స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్
నిర్మాత – కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం – పా రంజిత్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News