ప్రస్తుతం దర్శకులు హీరోలుగా, హీరోలు దర్శకులుగా మారి సినిమాలు చేస్తూ సక్సెస్‌లు కొడుతున్నారు. మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదివరకే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. ఇదొక యూత్ ఫుల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అందరికీ అర్థం అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్ చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. శక్తి శ్రీ గోపాలన్ పాడిన పాట బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తుంటే.. హీరోహీరోయిన్ల జోడి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. ఈ సినిమాలో సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించారు.
ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందించారు. ఉద్ధవ్.ఎస్.బి ఈ చిత్రానికి ఎడిటర్.
సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం: పవన్ కుమార్ కొత్తూరి, సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరి
నిర్మాతలు: పవన్ కుమార్.కె, బిషాలి గోయెల్
సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల
DOP: సజీష్ రాజేంద్రన్
ఎడిటర్: ఉద్ధవ్ SB
సాంగ్స్ కొరియోగ్రఫీ : రాజ్ పైడె
ఫైట్స్: నందు
PRO: ఎస్ ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…