వీక్షణం మూవీ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంది : మనోజ్ పల్లేటి

Must Read

కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఈ నెల 18న విడుదలైన మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించి , రామ్ కార్తీక్, కశ్వి హీరో, హీరోయిన్‌లుగా నటించిన ‘వీక్షణం’ సినిమాతో మరోసారి రుజువైంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మూవీ టీం థ్యాంక్స్ మీట్ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ :చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ ఈ రేంజ్ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంది. మొన్న థర్స్డే ప్రీమియర్ షో దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇదే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్‌కి వచ్చి మూవీ చూసి మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ చాలా పెద్ద థ్యాంక్స్.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ : ముందుగా మా సినిమాను ఇంతలా జనాల్లోకి తీసుకువెళ్లిన మీడియా వాళ్లకు, సినిమాను చూసి ఆదరించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. నేను కూడా నిన్న కొన్ని థియేటర్స్‌కి వెళ్లాను. అక్కడ అంతా చాలా పాజిటివ్‌గా ఉంది. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.

మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ: అందరికి చాల పెద్ద థ్యాంక్స్. రివ్యూస్ కూడా చాల బాగా వచ్చాయి. చాల హ్యాపీగా ఉంది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చాల చాల థ్యాంక్స్.

నటుడు శ్రీరామ్ మాట్లాడుతూ: ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, మీడియా వాళ్లకు చాలా థ్యాంక్స్. ఇది నా ఫస్ట్ సినిమా. నా మొదటి సినిమాకే ఇంతమంది ప్రేమ నాకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నన్ను ఈ పాత్రకు సెలెక్ట్ చేసిన డైరెక్టర్ మనోజ్ అన్నకు ఋణపడి ఉంటా. నాకు నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మా టీం అందరి గురించి మాట్లాడాలి అనుకున్నా కానీ టెన్షన్ వల్ల, వాళ్లందరికీ ఒకేసారి థ్యాంక్స్ చెబుతున్నాను నాకు చాల బాగా సపోర్ట్ చేసారు . అలాగే ప్రేక్షకులకు కూడా చాలా థ్యాంక్స్.

నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ: ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్లకు, ఆడియన్స్‌కి అందరికీ మనస్ఫూర్తిగా వెల్కమ్ అండి. నేను ముందుగా డైరెక్టర్ మనోజ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, నన్ను ఈ పాత్రకు తీసుకున్నందుకు. ఆయ‌న నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాలనే అనుకుంటున్నా. ఈ మూవీ‌లో కామెడీ మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. కామెడీ అంతలా బాగా రావడానికి కారణం నాతో కలిసి వర్క్ చేసిన ఫణి. ఇద్దరం పోటీ పడి మరీ నటించాం. థ్యాంక్స్, ఫణి. అలాగే హీరో కార్తీక్ గారికి కూడా థ్యాంక్స్, ఆయ‌న నాకు చాలా స్పేస్ ఇచ్చారు, నాది ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మిగిలిన నటీనటులకు, టెక్నిషియన్స్‌కి , ప్రొడ్యూసర్ అశోక్ గారికి అందరికి చాలా థ్యాంక్స్ అలాగే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్‌కి కూడా థ్యాంక్స్ అలాగే ఇప్పటివరకు సినిమా చూసి నచ్చిన వాళ్లను మీ ఫ్రెండ్స్‌ని, ఫామిలీ మెంబర్స్‌ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.

ఫణి మాట్లాడుతూ: ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా డైరెక్టర్ మనోజ్ గారికి చాల థ్యాంక్స్. చిన్న సినిమా అయినా ఎక్కడ బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయకుండా సినిమా నిర్మించారు. మా నిర్మాత అశోక్ గారు, అంతేకాకుండా ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్ కి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గారికి అందరికి చాల థ్యాంక్స్ అన్నారు.

Latest News

Daaku Maharaaj’s Third Song “Dabidi Dibidi”

The much-anticipated third song from Daaku Maharaaj, titled "Dabidi Dibidi," is here and setting social media on fire! This...

More News