వెర్సటైల్ హీరో నాగశౌర్య , అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. బ్రాహ్మణ కుర్రాడిగా, ఉద్యోగం మీద నగరానికి వచ్చిన తర్వాత అర్బన్ కుర్రాడిగా అలరించనున్నాడు. ట్రైలర్ లో తన నటనతో అదరగొట్టాడు నాగశౌర్య. ఈరోజు చిత్ర బృందం టైటిల్ సాంగ్‌ని లాంచ్ చేసింది. ఈ పాటలో నాగ శౌర్య ఒక ఇరకాట పరిస్థితిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అతని ప్రేమలో సమస్య తో పాటు కుటుంబంతో కూడా చిక్కొచ్చింది. అంతేకాకుండా వెన్నెల కిషోర్ కోమా నుండి మేల్కొలపడానికి ఎదురు చూస్తున్నాడు నాగ శౌర్య . దర్శకుడు అనీష్ కృష్ణ అండ్ టీమ్ ఈ సాంగ్‌ని హిలేరియస్ గా ప్రజంట్ చేశారు. మహతి స్వర సాగర్ క్యాచి నెంబర్ ని స్కోర్ చేయగా, రామ్ మిరియాల ఎనర్జిటిక్ గా పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శౌర్య తల్లిగా అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటర్. ‘కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న విడుదల కానుంది. తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం: అనీష్ ఆర్. కృష్ణ నిర్మాత: ఉషా ముల్పూరి సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి బ్యానర్: ఐరా క్రియేషన్స్ సంగీతం: మహతి స్వరసాగర్ డివోపీ: సాయిశ్రీరామ్ సహ నిర్మాత: బుజ్జి ఎడిటర్ - తమ్మిరాజు ఆర్ట్ డైరెక్టర్ - రామ్ కుమార్ డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్ పీఆర్వో: వంశీ, శేఖర్
ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘’నేను c/o నువ్వు’’.ఈ చిత్రానికి…
Naane Varuvean is set for its theatrical release this month and the makers are yet to officially announce the release…
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన సోదరుడు మరియు విలక్షన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో "నానే వరువేన్" చిత్రాన్ని చేసిన విషయం విదితమే. తాజాగా షూటింగ్…
వినోదాత్మకమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోస్ తో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్న 'జీ తెలుగు' ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకువస్తూ వారి మన్ననలు పొందుతున్న…
వెర్సటైల్ హీరో నాగశౌర్య డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి' రెండు వారాల్లోపు థియేటర్ లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.…
విజయ నిర్మల గారి మనవుడు శరణ్ కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం…
ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్…
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద గోపాల్ దర్శకత్వంలో, పులి, ఇంకొకడు, సామి 2, పలు హిందీ చిత్రాలు నిర్మించిన పాపులర్ ప్రొడ్యూసర్ 130 కి పైగా చిత్రాలు…
శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా మిథున ఎంటర్‌టైన్‌మెట్స్ ప్రై.లి, సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’.…