'Das Ka Dhamki' gave the best openings of my career: Vishwak Sen.... Vishwak Sen is the protagonist, director and producer…
Worked honestly for 'Daska Dhamki'. Even if a lot of risks are taken. This movie will change my life: Vishwak…
Dynamic hero Vishwak Sen's first Pan India film is 'Das Ka Dhamki'. Vishwak Sen is also the protagonist, director and…
Vishwak Sen who is crazy about cinema should be encouraged. 'Das Ka Dhamki' Wants Big Blockbuster Young Tiger NTR in…
డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ' అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. విశ్వక్…
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్ తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్సకత్వంలో రాబోతున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ'. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. నివేదా పేతురాజ్ కథానాయిక. దాస్ కా ధమ్కి రోమ్కామ్, యాక్షన్ థ్రిల్లర్. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్ వుంటుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి. 95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్, హరి హర వీర మల్లు చిత్రాలకు స్టెంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజి తో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఫుకెట్ లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్ ను, స్పెయిన్ లో ఒక చిన్న షెడ్యూల్ ను టీమ్ పూర్తి చేసుకుంది. దీపావళి కి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు. బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్ కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ ను పర్యవేక్షించారు. చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ప్రతి నటుడికి సమానమైన, మంచి ప్రాముఖ్యత ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్‌తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద…