‘దాస్ కా ధమ్కీ’ కోసం నిజాయితీగా పని చేశా. నా జీవితాన్ని మారుస్తుంది: విశ్వక్ సేన్

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు చార్ట్‌బస్టర్‌ గా నిలిచాయి. ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 2.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ధమ్కీ’ నాకు చాలా స్పెషల్ మూవీ. నటనతో పాటు నిర్మాణం దర్శకత్వంలో చాలా నిజాయితీగా పని చేశాను. డబ్బులు సంపాయించడానికి  ఎప్పుడు సినిమా లేదు కానీ ఈ సినిమా కోసం చాలా డబ్బులు పెట్టేశాను. ఈ ప్రయాణంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకి కృతజ్ఞతలు. ప్రసన్న కథ చెప్పిన్నపుడే అద్భుతమనిపించింది. డెవలప్ చేస్తూ వెళ్తుంటే దాని స్కేల్ పెరుగుతూవెళ్ళింది. నివేదా కూడా చాలా మంచి సూచన ఇచ్చింది. దాంతో సినిమా మరో లెవెల్ కి వెళ్ళింది. ఆ సూచన ఏమిటనేది విడుదల తర్వాత చెప్తాను. మహేష్, హైపర్ ఆదితో పని చేస్తుంటే కాలం సరదాగా గడిచిపోయింది. నాకు ఎలాంటి మ్యూజిక్ కావాలో  లియోన్ కి బాగా తెలుసు. ఇందులో బీజీఏం మాములుగా వుండదు. నివేద కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. ఆమెకు కథ నచ్చడంతో ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. మా నాన్న నన్ను చాలా భరించారు. ఈ సినిమా ఆయనకి చాలా డబ్బులు తెచ్చిపెట్టాలి. వన్మయి క్రియేషన్స్ ఇక్కడితో ఆగిపోదు. ఇంతకుమించి సినిమాలు వస్తాయి. మా టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. దాస్ కా ధమ్కీ 22న వస్తోంది. చాలా రిస్కులు తీసుకొని చేసిన సినిమా ఇది. దీనికి కారణం సినిమాపై  ప్రేక్షకులపై వున్న నమ్మకం. నేను డైరక్షన్ చేసిన ఫలక్ నామా దాస్ కి ఎంత ప్రోత్సాహం దొరికిందో డానికి రెండింత ప్రోత్సాహం ఈ చిత్రానికి దొరుకుతుంది. ‘దాస్ కా ధమ్కీ’ నా జీవితాన్ని మారుస్తుంది’’ అన్నారు

నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. దాస్ కా ధమ్కీ’ నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా విశ్వక్ పూర్తి న్యాయం చేశారు. లియోన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత రాజు గారు అద్భుతమైన వ్యక్తి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. దాస్ కా ధమ్కీ’మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.

ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం యూనిట్ పడిన కష్టం ఒకెత్తు, విశ్వక్ అన్న పడిన కష్టం మరో ఎత్తు. ఇరవై రోజులుగా తిరుగుతూనే వున్నాడు. చాలా ప్రేమించి ఆయన చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం సర్వసం పెట్టి కష్టపడి పని చేశాడు. ఆయన కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా వుంటుంది. సెకండ్ హాఫ్ థ్రిల్ కోసం సినిమాకి రావాలి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్.

నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ.. మా బ్యానర్ లో ఇది రెండో సినిమా. మొదటి సినిమా ఫలక్ నామా దాస్ విడుదల కాకముందే మా బాబుకి మంచి పేరు తీసుకొచ్చింది. దాస్ కా ధమ్కీ’ కోసం పదిహేను నెలలుగా కష్టపడుతున్నాడు. సినిమాకి కావాల్సిన అన్నీ సమకూర్చాడు. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నచ్చే సినిమా ఇది. సినిమా చూసిన ప్రేక్షకులు కథ గురించి బయటికి లీక్ చేయకూడదని కోరుకుంటున్నాను. సెకండ్ హాఫ్ లో ఏమౌతుందో వేరే వాళ్ళకి చెప్పకుండా వుంటే ఈ సినిమా పెద్దస్థాయిలో వుంటుంది’’ అన్నారు

లియోన్ జేమ్స్ మాట్లాడుతూ.. విశ్వక్ తో ఇది నా మూడో సినిమా.  దాస్ కా ధమ్కీ కోసం చాలా కొత్తగా సౌండ్ డిజైన్ చేశాం. నేపధ్య సంగీతంలో చాలా డిఫరెంట్ సౌండ్ వినిపిస్తాయి. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇస్తాయి. సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా వుంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా గొప్పగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. మహేష్ , హైపర్ ఆది, అన్వర్ అలీ  తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ‘దాస్ కా ధమ్కీ’ టీం సమాధానలు ఇచ్చింది :

మీతో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు దర్శకులు వుంటారు కదా.. మీరే చేయడానికి కారణం ఏమిటి ?

విశ్వక్ : ఈ కథని నేను ఏ స్థాయిలో అనుకున్నానో అలా తీయాలంటే వేరే నిర్మాత అయితే ఇబ్బంది పడే అవకాశం వుందనిపించింది.అందుకే నేను నిర్మాతగా మారాల్సివచ్చింది. పరిశ్రమలో నాకూ మంచి నిర్మాణ సంస్థ స్థాపించలాని వుంది. మంచి సినిమాలు తీయాలి. ‘డబ్బులు సంపాయించడం కోసం సినిమాలు చేయడం లేదు. సినిమాలు చేయడానికి డబ్బులు సంపాయిస్తున్నా’ అనేది నా నినాదం.

ఎన్టీఆర్ గారు మిమ్మల్ని డైరెక్షన్ వదిలేమని చెప్పారు కదా ? దాని గురించి

వదిలేస్తా. కానీ అప్పుడప్పుడు పట్టుకుంటా. (నవ్వుతూ) ఏదైనా కథ ప్రేక్షకులకు ఖచ్చితంగా చెప్పాలనుకున్నప్పుడు డైరెక్షన్ చేస్తా.

ఒక నటనతో పాటు డైరెక్షన్ చేయడంలో వున్న సౌలభ్య త ఏమిటి ? యాక్టర్ డైరెక్టర్ డామినేషన్ ఏమైనా ఉంటుందా ?

నేను యాక్టింగ్ చేసినప్పుడు కూడా సినిమా అంతా నామీదే నడవాలనుకునే మనిషిని కాదు. కథలో అందరికీ అన్ని పాత్రలకు ప్రాధన్యత వుంటుంది. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మీటర్ లో తీశా. సెకండ్ హాఫ్ లో చాలా థిన్ లైన్ వుంటుంది దాని గురించి రిలీజ్ తర్వాత మీరు మాట్లాడతారు. సెకండ్ హాఫ్ విశ్వక్ సేన్ మాత్రమే తీయగలిగే సినిమా అని నమ్మకంగా చెప్పుకోగలను. విశ్వక్ సేన్ డైరెక్షన్ వలన ప్లస్ ఏమిటంటే.. సెకండ్ హాఫ్.

మీ ఈవెంట్స్ కి బాలకృష్ణ గారు లాంటి పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి బ్లెస్ చేయడం ఎలా అనిపిస్తుంది ?

దీనిని ఒక బ్లెసింగ్ గా భావిస్తాను. బాలకృష్ణ గారు , ఎన్టీఆర్, రామ్ చరణ్..ఇలా అందరూ ఎంతో సపోర్టివ్ గా వుండటం నిజంగా బ్లెసింగ్.

డబుల్ రోల్ అంటే చాలా సినిమాలు వచ్చాయి.. ఇది ఎలా కొత్తగా వుండబోతుంది.

ఒక్క సినిమాలో రెండు సినిమాలు చూసే ఎఫెక్ట్ వుంటుంది. ఇంటర్వెల్ నుంచి కథ మరో లెవెల్ వుంటుంది. ముగింపు చాలా బరువుతో వస్తారు. పాత్రలు మీకు గుర్తుండిపోతాయి.

ఈ సినిమాలో మీరు సంపాయించింది మొత్తం పెట్టేశారని విన్నాం.. అంత నమ్మకం కలిగించిన అంశం ఏమిటి ?

ఇలా చేయడం ఇది రెండో సారి ఫలక్ నామా దాస్ కి కూడా మొత్తం పెట్టేశాను. అప్పుడు అది ఎంత పెద్దదో ఇప్పుడు ఇది అంత పెద్దది. సేఫ్ జర్నీ చేయోచ్చు, కానీ చేతిలో కథ వుంది. బాగా తీయగలననే నమ్మక వుంది. ఆ నమ్మకంతోనే నిజాయితీగా చేశాను. 

రాజు గారు.. మీ అబ్బాయి మీతో చాలా ఎక్కువ ఖర్చు పెట్టించారట ? బాగా విసిగించారట ?

క్యాలిటీ లేకపోతే నేనూ రాజీపడను. బెస్ట్ క్యాలిటీ తీసుకోస్తాడనే నమ్మకం వుంది. అది నిజమైయింది. సినిమా మూడింతలు బడ్జెట్ పెరిగింది. తను ఏది అనుకున్నారో అది తీశాడు.

నివేదా గారు.. ఈ సినిమాలో విశ్వక్ ఎదుర్కున్న టఫ్ మూమెంట్ ఏమిటి ?

ఇందులో తొమ్మిది నిమిషాల సింగిల్ షాట్ వుంది. మొత్తం 18 టేకులు తీసుకున్నాం. టఫ్ గా అనిపించిన ఎక్కడా రాజీపడకుండా ఆ షాట్ ని తీశారు విశ్వక్.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

17 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago