Mass Maharaja Ravi Teja

‘వాల్తేరు వీరయ్య’ నుండి మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' ను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో…

3 years ago

‘మట్టి కుస్తీ’ లో ఫ్యామిలీ, లవ్, ఎంటర్టైన్మెంట్ – మాస్ మహారాజా రవితేజ

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది.'ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో 'మట్టి కుస్తీ' ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రవితేజ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దర్శకులు సుధీర్ వర్మ, వంశీ, జ్వాలా గుత్తా  తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో రవితేజ, విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, జ్వాలా గుత్తా చిత్రంలోని చల్ చక్కని చిలక పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. అనంతరం మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ..'మట్టి కుస్తీ'కి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జస్టిన్ ప్రభాకరన్ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. తనతో సినిమా కూడా చేయాలని విష్ణుతో చెప్పాను. రిచర్డ్స్ వండర్ ఫుల్  కెమరామెన్. దర్శకుడు చెల్లా అయ్యావు కథ చెప్పినపుడు చాలా ఎంజాయ్ చేశాను. తన సెన్స్ ఆఫ్ హ్యుమర్ బావుంటుంది. తనతో ఓ సినిమా మాత్రం చేయాలి. అందం, ప్రతిభ కలిపితే ఐశ్వర్య లక్ష్మీ. ఇందులో ఆమె పాత్రని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విశాల్, ఐశ్వర్య కెమిస్ట్రీ స్టన్నింగా వుంటుంది. ఇది కేవలం స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు. ఎమోషన్, ఫ్యామిలీ, లవ్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ వున్నాయి. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ ఈ రెండు టీములు సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధులు అభిమానులే. హీరోగా ఎంతో సపోర్ట్ చేశారు. నిర్మాతగా కూడా సపోర్ట్ చేసేయండి. విష్ణు విశాల్ పాజిటివ్ పర్శన్. ఫస్ట్ మీటింగ్ లోనే విశాల్ నాకు ఎప్పటి నుండో తెలుసనే ఫీలింగ్ కలిగింది. అన్నీ సింగిల్ సిట్టింగ్ లోనే మొదలైపోయాయి. సినిమా చాలా బావొచ్చింది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 2న థియేటర్లో కలుద్దాం'' అన్నారు విష్ణు విశాల్ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ' డిసెంబర్ 2 థియేటర్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. చాలా ఆనందంగా వుంది.  రవితేజ గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయనది చాలా మంచి మనసు. ఒక్క మీటింగ్ లోనే నాపై పూర్తి నమ్మకం ఉంచారు. జ్వాలా నన్ను తెలుగు సినిమాలు చేయాలనీ చెప్పేది. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ని ప్రేమిస్తారు. రవితేజ గారి లాంటి గొప్ప వ్యక్తి సపోర్ట్ తో మీ ముందుకు వస్తున్నాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఆడ మగ సమానమనే సందేశాన్ని చాటే సినిమా ఇది. మహిళా ప్రేక్షకులు సినిమాని చాలా ఇష్టపడతారు. డిసెంబర్ 2న అందరూ థియేటర్ కి వెళ్లి 'మట్టి కుస్తీ' చూడాలి'' అని కోరారు. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ..  'మట్టి కుస్తీ'చక్కని సినిమాని నిర్మించిన రవితేజ గారు, విష్ణు విశాల్ గారికి కృతజ్ఞతలు. డిసెంబర్ 2న మీ ఫ్యామిలీ అందరికీతో కలసి థియేటర్లో 'మట్టి కుస్తీ' ని చూసి ఎంజాయ్ చేయండి'' అని కోరారు దర్శకుడు చెల్లా అయ్యావు మాట్లాడుతూ.. రవితేజ గారు 'మట్టి కుస్తీ' ని నిర్మించడం చాలా ఎక్సయిటింగా వుంది. రవితేజ గారి కి తమిళనాడులో కూడా భారీ ఎత్తున అభిమానులు వున్నారు. క్రాక్ సినిమా హౌస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఆ సినిమాని చాలా మంది రీమేక్ చేయాలని భావించారు.  అయితే రవితేజ గారు బాడీ లాంగ్వేజ్, స్టయిల్ రిప్లేస్ చేయడం చాలా కష్టం. రవితేజ గారు త్వరగా తమిళ్ లో సినిమా చేయాలి. విష్ణు విశాల్, ఐశ్వర్య అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. ఫ్యామిలీ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. డిసెంబర్ 2న అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.  జ్వాలా గుత్తా మాట్లాడుతూ.. విష్ణుని తెలుగులో రమ్మని మూడేళ్ళుగా అగుడుతున్నాను. తన చిత్రాల కంటెంట్ బావుటుంది. రవితేజ గారికి ని నేను పెద్ద అభిమానిని. విశాల్ పై రవితేజ గారు మొదటి మీటింగ్ లోనే ఎంతో నమ్మకం ఉంచారు. ఇది చాలా గ్రేట్. 'మట్టి కుస్తీ' కోసం  అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అవుట్ పుట్ పై చాలా హ్యాపీగా వున్నాం. టీం అందరికీ గుడ్ లక్'' తెలిపారు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ'' సినిమా గురించి నాకు తెలుసు. ఈ సినిమా ఖచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. 'ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్, టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు వంశీ మాట్లాడుతూ .. 'మట్టి కుస్తీ'' ట్రైలర్ ప్రామెసింగా వుంది. విష్ణు విశాల్ గారు మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తుంటారు. రవితేజ గారు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఖచ్చితంగా సినిమా ప్రత్యేకంగా వుంటుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు. అజయ్ మాట్లాడుతూ.. 'మట్టి కుస్తీ'లో నెగిటివ్ రోల్ లో కనిపిస్తా, కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. రవితేజ గారు నిర్మించారు మరింత ఎక్సయిటింగా అనిపించింది. విష్ణు విశాల్ విలక్షణమైన కథలు ఎంచుకొని విజయాలు సాధిస్తుంటారు. 'మట్టి కుస్తీ'కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది'' అన్నారు.…

3 years ago

ధమాకానుండి డు డు సాంగ్ నవంబర్ 25న విడుదల

  మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా "ధమాకా" నుండి డు డు సాంగ్ ని నవంబర్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రవితేజ్ లుక్ టెర్రిఫిక్ గా వుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే,  సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

3 years ago

ఊర్వశి రౌతేలా ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రేక్షకులు కోరుకునే  అన్ని అంశాలు ఉంటాయి. మాస్ మహారాజా రవితేజ ప్రజన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్. చిత్రంలో చిరంజీవి, రవితేజ ఇద్దరిపై మెగా మాస్ నంబర్‌ వుంది. ఈ పాటని ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించారుఅంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై ఓ భారీ సెట్‌లో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించనున్నారు. దీనికోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫుట్ ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేయగా, టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. లావిష్ ప్రొడక్షన్ డిజైన్‌కు పేరుపొందిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌ డేట్‌ అంచనాలను పెంచుతోంది. తప్పకుండా సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక పండగలా వుంటుంది.  ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.ఆర్థర్ ఎ విల్సన్ కెమెరా మెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, ఊర్వశి రౌతేలా (స్పెషల్ సాంగ్) తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి సిఈవో: చెర్రీ కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి పీఆర్వో: వంశీ-శేఖర్ పబ్లిసిటీ: బాబా సాయి కుమార్ మార్కెటింగ్: ఫస్ట్ షో

3 years ago

విష్ణు విశాల్’మట్టి కుస్తీ’ ఫస్ట్ లుక్‌ లాంచ్

మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగానిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ'. ఆర్‌ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌ లపై రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు రవితేజ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను విడుదల చేశారు. పోస్టర్‌లో విష్ణు విశాల్ స్టార్ రెజ్లర్‌గా రింగ్‌లో బిగ్ ఫైట్ కి రెడీ అవుతున్నట్లుగా కనిపించారు. రెజ్లింగ్ డ్రెస్ లో, కండలు తిరిగిన శరీరంతో ఆకట్టుకున్నాడు విష్ణు విశాల్. మట్టి కుస్తీ  కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు. మట్టి కుస్తీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌ లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తారాగణం: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్ బ్యానర్లు: ఆర్ టి  టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ డీవోపీ:  రిచర్డ్ ఎం నాథన్ సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ ఎడిటర్: ప్రసన్న జికె ఆర్ట్ డైరెక్టర్: ఉమేష్ జే కుమార్ లిరిక్స్: వివేక్ పీఆర్వో వంశీ-శేఖర్

3 years ago

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల, త్రినాధరావు నక్కిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “ధమాకా” మాస్ క్రాకర్ (టీజర్) అక్టోబర్ 21న విడుదల

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాధరావు నక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా' పాజిటివ్ వైబ్స్ తో దూసుకెళుతోంది. రవితేజ మార్క్ అవుట్ అండ్ అవుట్…

3 years ago

Mass Raja Lyrical From DHAMAKA” On Sep 23rd

The makers of Mass Maharaja Ravi Teja starrer Dhamaka began musical promotions with the mass number Jinthaak which became a…

3 years ago

“ధమాకా” నుండి మాస్ రాజా లిరికల్ వీడియో సెప్టెంబర్ 23న విడుదల

  మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' మేకర్స్ చార్ట్‌బస్టర్‌ 'జింతాక్‌'తో గ్రాండ్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ మాస్ రాజా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.…

3 years ago

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ ‘మెగా154’ భారీ షెడ్యూల్ హైదరాబాద్‌ లో ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154.  మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబధించిన కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీమ్ మొత్తం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు. కీలకమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్‌ లో చిత్రీకరిస్తున్నారు. మెగా154  ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో దర్శకుడు బాబీ కల నిజమైనట్లయింది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్ , పవర్- ప్యాకెడ్ పాత్రలో మెగాస్టార్ ని చూపించబోతున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి…

3 years ago

మహారాజా రవితేజ, శ్రీలీల”ధమాకా” గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్ లిమిటెడ్ ఎంటర్‌టైనర్ "ధమాకా''. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, కమర్షియల్ సబ్జెక్ట్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోన్న ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన మొదటి పాట 'జింతాక్'కు అద్భుతమైన  స్పందన వచ్చింది. తాజాగా ధమాకా చిత్ర యూనిట్ అదిరిపోయే కొత్త అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రం గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల వినాయక చవితి సందర్భంగా సాయంత్రం 5:01 గంటలకు విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ కలర్‌ ఫుల్‌ గా, రొమాంటిక్‌ గా కనిపిస్తోంది. రవితేజ శ్రీలీలని తన దగ్గరికి తీసుకొని, ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తుండగా శ్రీలీల కాస్త  టెన్షన్ పడుతూ అయోమయంగా చూడటం ఆకట్టుకుంది, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తారాగణం: రవితేజ, శ్రీలీల సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఫైట్స్: రామ్-లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల పీఆర్వో: వంశీ శేఖర్

3 years ago