chiranjeevi

‘వాల్తేరు వీరయ్య’ 115 సెంటర్లలో 50 రోజులు పూర్తి

Megastar Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers 'Waltheru Veeraiya' Completed 50 Days in 115 Centers

2 years ago

‘భోళా శంకర్’ షూటింగ్ పునఃప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోలా శంకర్” షూటింగ్ ఈరోజు పునఃప్రారంభమైంది. మెగా బ్లాక్‌బస్టర్…

2 years ago

‘వారసుడు’ తెలుగులో జనవరి 14 న విడుదల చేస్తున్నాం. నిర్మాత దిల్ రాజు

మన తెలుగు బిగ్గర్ స్టార్స్ చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కి గ్రాండ్ గా విడుదల కావాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘వారసుడు’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తెలుగులో పెద్ద విజయం సాధిస్తుంది: నిర్మాత దిల్ రాజు దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు (సోమవారం) వారసుడు తెలుగు విడుదల తేదిని తెలియజేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘వారసుడు’ చిత్రాన్ని సంక్రాంతి వారసుడిగా జనవరి 14న విడుదల చేస్తున్నాం. తమిళ్ లో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విదుదలౌతుంది.  ఈ నిర్ణయం వెనుక వున్న కారణం.. జనవరి 12 బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి, జనవరి 13న చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలౌతున్నాయి. ప్రతి థియేటర్ లో ముందు మన తెలుగు బిగ్గర్ స్టార్స్ సినిమాలు పడాలి. అన్ని చోట్ల వారికి థియేటర్లు దొరకాలి. తర్వాతే నా సినిమా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. సంక్రాంతి సినిమాలకి మా వారసుడు పోటి కాదని మొదటి నుండి చెబుతున్నాను. మాది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు సంక్రాంతి వారసుడు చేయాలనేదే నా ప్రయత్నం. బాలకృష్ణ గారి చిరంజీవి గారి సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద రిలీజ్ కావాలి. తర్వాత నా సినిమా రావాలని పాజిటివ్ గానే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. అందరం బావుండాలనే నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను.  11న తమిళ్ లో విడుదలౌతున్న ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ కాబోతుంది. ఒక చోట విజయం సాధిస్తే ఆ చిత్రాన్ని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగా వుంటారు. కాంతార, లవ్ టుడే చిత్రాలు ఇది నిరూపించాయి.  మా గత చిత్రాలు సీతమ్మ వాకిట్లో, ఎఫ్ 2, శతమానం భవతి సినిమాల్లనే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే చిత్రం వారసుడు. ఒక మంచి సినిమా చుశామనే అనుభూతిని ఇస్తుంది వారసుడు. ఇది దిల్ రాజు బ్రాండ్. తమన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. విజయ్ ఆల్రెడీ సూపర్ స్టార్. ఇందులో అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో శరత్ కుమార్,  జయసుధగారు తల్లితండ్రులుగా.. విజయ్, శ్రీకాంత్ శ్యాం బ్రదర్స్ గా కనిపిస్తారు. ఇది పక్కా ఫ్యామిలీ స్టొరీ. ఇందులో ఫ్యామిలీ కోణంలో ఒక కొత్త పాయింట్ చెబుతున్నాం. సినిమా చూసి వచ్చేటప్పుడు ఆ పాయింట్ ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది. ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా ఫీలౌతారు. ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్ తో ప్రేక్షకులు బయటికి వస్తారు. మా సంక్రాంతి వారసుడు మళ్ళీ సంక్రాంతికి తెలుగులో కూడా ఒక మంచి హిట్ సినిమా కాబోతుంది’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. వారసుడు యునివర్సల్ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. మన తెలుగు స్టార్స్ కి గౌరవం ఇస్తూ.. ఇన్ని కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాని 14కి వాయిదా వేయడం నిజంగా గ్రేట్. దిల్ రాజు గారికి హ్యాట్సప్. ఇంత సాహసం ఏ నిర్మాత చేయరు. వారసుడు నా తొలి తమిళ సినిమా. అలాగే దిల్ రాజు గారి బ్యానర్ లో చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా గురించి చెప్పాలంటే విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు గారి గురించి చెప్పాలి. విజయ్ తో సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసి చాలా కాలమైయింది. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఇది తెలుగు సినిమాలానే ఫీలౌతాము. వారసుడు సంక్రాంతికి లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తుందని నమ్ముతున్నాను. వారసుడు సూపర్ డూపర్ హిట్ అవుతుంది.’’ అన్నారు

2 years ago

‘వాల్తేరు వీరయ్య’ నుండి బాబీ సింహా లుక్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.'వాల్తేరు వీరయ్య'లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా ఓ కీలక పాత్ర పోస్తున్నారు. బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ''సోలమన్ సీజర్''గా చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో బాబీ సింహ లుక్ చాలా ఇంట్రస్టింగా వుంది.  టక్ చేసుకున్న పూల చొక్కా, మెడలో బంగారు గొలుసులు, చేతికి బంగారు కడియం, గడియారం,  నల్లటి కళ్ళజోడు తో బ్రైట్ వింటేజ్ లుక్ లో కనిపించారు బాబీ సింహ. ఫస్ట్ లుక్ చూస్తుంటే వాల్తేరు వీరయ్య లో ''సోలమన్ సీజర్'' పాత్ర చాలా కీలకంగా వుండబోతుందని అర్ధమౌతోంది.మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి సిఈవో: చెర్రీ కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి పీఆర్వో: వంశీ-శేఖర్ పబ్లిసిటీ: బాబా సాయి కుమార్ మార్కెటింగ్: ఫస్ట్ షో

2 years ago

Waltair Veerayya, released for Sankranti

The makers of megastar Chiranjeevi’s Mega154 offered a sparkle before Diwali with a small glimpse of Mega154 and it made…

2 years ago

Mega154 Title Teaser On October 24th

Megastar Chiranjeevi’s mega mass and commercial entertainer Mega154 with director Bobby (KS Ravindra) is fast progressing with its shoot in…

2 years ago

అల్లు రామలింగయ్య మరణించలేదు మన మద్యే ఉన్నారు

ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడైన పద్మశ్రీ  అల్లు రామలింగయ్య గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు ఫ్యామిలీ పలు కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా…

2 years ago

అక్టోబర్ 4న …ఏడిద నాగేశ్వరావు 7వ వర్ధంతి

తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు,ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు.. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది. ఆయన…

2 years ago

చిరంజీవి గారి కోసమే గాడ్ ఫాదర్ చేశాను

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌ లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో గ్రాండ్ జరిగింది.ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..'గాడ్ ఫాదర్' లో ఒక బలమైన పాత్ర వుంది. లూసిఫర్ లో ఆ పాత్రని చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేశారు. గాడ్ ఫాదర్ లో ఈ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బావుంటుందని భావించాం. మేము కోరగానే ''నేను చేయాలని మీరు కోరినట్లయితే మరో ఆలోచన లేకుండా చేస్తాను. మీరు ఇంకెం అలోచించకండి. నేను చేస్తాను'' అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. సల్మాన్ భాయ్  ఓకే చేసిన తర్వాత ఈ సినిమా ఆరా మరింతగా పెరిగింది. షూటింగ్ లో మాకు ఎంతగానో సహకరించారు. సల్మాన్ భాయ్ గాడ్ ఫాదర్ లోకి రావడం..ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు. మాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. సల్మాన్ భాయ్ తో కలసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ గా చేశాను.  ఆ జోష్ ని తెరపై చూస్తారు'' అన్నారుసూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను.  సినిమాల పట్ల చిరంజీవి గారికి, మాకున్న ప్రేమ దీనికి కారణం. చిరంజీవి గారితో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వుంటాను. మల్టీ స్టార్ చిత్రాలు చేయడం పరిశ్రమకు మంచింది. సినిమాలని నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారు. నెంబర్స్ పెరుగుతాయి. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది'' అన్నారు.సత్యదేవ్ మాట్లాడుతూ.. ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ గారి ముందు నిలుచుని మాట్లాడటం గొప్ప అనుభూతి. అన్నయ్య గారిపై ప్రేమతో నటుడిని అయ్యాను. అన్నయ్యే ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. అన్నయ్యకి ఎదురుగా నటించడం పెద్ద  సవాల్. సల్మాన్ ఖాన్ గారి రూపంలో మరో సవాల్ వచ్చింది (నవ్వుతూ).  ఇద్దరు మెగాస్టార్లుకి ఎదురుగా నిలబడే పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఎప్పుడూ ఊహీంచలేదు. నా బెస్ట్ ఇవ్వడనికి ప్రయత్నించాను. మోహన్ రాజా గారు సినిమాని చాలా కూల్గా డీల్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అక్టోబర్ 5న మీ అందరినీ అలరిస్తుంది'న్నారు.దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. ఇద్దరు మెగాస్టార్లుని డైరెక్ట్ చేయడం నా కల నేరవేరినట్లయింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ ని ఇస్తుంది. సినిమా అందరూ తప్పకుండా థియేటర్లో చూడాలి'' అని కోరారు.

2 years ago

Chiranjeevi –Salman Khan’s GodFather Mega Public Event At JNTU Ground In Anantapur On September 28th

Megastars Chiranjeevi and Salman Khan will be seen sharing the screen space to offer mega feast with the most awaited…

2 years ago