ప్రెస్ మీట్లు

హను-మాన్ నుండి తేజ సజ్జా బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

కెరీర్ ప్రారంభం నుండే సబ్జెక్ట్‌ ల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్న ప్రామిసింగ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హను-మాన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. పుట్టినరోజు స్పెషల్ గా.. తేజ సజ్జా బ్రాండ్ న్యూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ పోస్టర్ లో తేజ సజ్జా సంప్రదాయ వస్త్రధారణలో తలపాగ చుట్టుకుని, ఎడ్ల బండిని నడుపుతూ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ప్రత్యేక శక్తులతో సూపర్‌హీరోగా కనిపించనున్న ఈ చిత్రంలో తేజ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించనున్నారు.

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. బిగ్ స్టార్స్,  టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వెంకట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూసర్, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నలుగురు ట్యాలెంటెడ్ సంగీత దర్శకులు – అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూస్తున్నారు.

తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్  తదితరులు

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

నిర్మాత: కె నిరంజన్ రెడ్డి

బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్

సమర్పణ: శ్రీమతి చైతన్య

స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే

డీవోపీ: దాశరధి శివేంద్ర

సంగీత దర్శకులు: అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్,  కృష్ణ సౌరభ్

ఎడిటర్: ఎస్బీ రాజు తలారి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి

లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి

అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల

పీఆర్వో : వంశీ-శేఖర్

కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి

Tfja Team

Recent Posts

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…

7 hours ago

Thanks Vinayak For Launching Teaser Of Barabar Premistha

The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…

7 hours ago

Deccan Sarkar Movie Poster and Teaser Launch

Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…

8 hours ago

‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…

8 hours ago

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…

8 hours ago

Second Schedule of Sci-Fi Action Killer has been wrapped up

Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…

8 hours ago