`ఆకాశ వీధుల్లో` ట్రైలర్ విడుద‌ల

గౌతమ్‌ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వు లేని ఏకాకిగా..’ అనే పాటల‌ను ఇటీవ‌లే విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్‌ లిరిక్స్‌ అందించగా, సింగర్‌ కాల భైరవ పాడారు. జూడా శాండీ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించారు. కాగా, మంగ‌ళ‌వారం నాడు ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది.

అనంత‌రం సంగీత ద‌ర్శ‌కుడు జూడా శాండీ మాట్లాడుతూ, నా అస‌లుపేరు రాజేష్ రాధాకృష్ణ‌న్‌.  గౌత‌మ్ కృష్ణ‌. నాకు అవ‌కాశం ఇచ్చి ప్రోత్స‌హించారు. అంద‌రికీ న‌చ్చే సినిమా. చిత్ర టీమ్‌ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

చిత్ర నిర్మాత మ‌నోజ్ మాట్లాడుతూ, సెప్టెంట‌ర్ 2న మా సినిమా విడుద‌ల‌కాబోతుంది. అంద‌రూ ఆద‌రించండి. మా అబ్బాయే హీరోగా చేశాడని తెలిపారు.

క‌థా ర‌చ‌యిత‌, హీరో, ద‌ర్శ‌కుడు అయిన గౌత‌మ్ కృష్ణ మాట్లాడుతూ, మాది కొత్త టీమ్‌. మొద‌టి సినిమా. ఎం.బి.బి.ఎస్‌. పూర్తిచేసి సినిమాపై త‌ప‌న‌తో ఈ  సినిమా తీశాను. ఈ సినిమాను ఎందుకుచూడాల‌నేవారికి చెప్పేది ఒక్క‌టే. ఈ సినిమా ఒక హీరో మీద‌నో కేరెక్ట‌ర్ మీద‌నే తీసిందికాదు. యంగ్‌స్ట‌ర్స్ అంద‌రి క‌థ‌. ఎదిగి న‌త‌ర్వాత వ‌య‌స్సువ‌చ్చిన‌వారికి చెందిన‌ క‌థ కూడా. మ‌న‌లో మ‌న‌కు జ‌రిగే సంఘ‌ర్ష‌ణ ఇందులో చ‌క్క‌గా చూపించాం. ట్రైల‌ర్‌ లో డ్రెగ్స్‌, ఆల్క‌హాలు అంశాలున్నాయి.వీటిపై ప‌లువురు కామెంట్లు చేశారు. ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా సినిమాను ఎలా చూపించాలో నాకు తెలుసు. అందుకే సినిమా మొత్తం చూసి మీరు స్పందిచండి. ఇది అన్ని వ‌య‌స్సుల‌వారికి న‌చ్చే సినిమా. ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచించేలా చేస్తుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. ఇందులో రెండు షేడ్స్ వున్న పాత్రను పోషించాను. మాతోపాటు 40 మంది మీముందుకు వ‌స్తున్నాం. మీ ఆశీర్వాదం కావాలి. ఇందులో న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది కూడా వున్నాం. కుటుంబంలోని పిల్ల‌ల ఆలోచ‌న‌లు ఎలా వుంటాయి అనేది పెద్ద‌లు గ్ర‌హించేట్లుగా చూపించాం. త్వరలో ప్రీ రిలీజ్ వేడుక వుంది. అప్పుడు మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాను. క‌మ‌ర్షియ‌ల్ అంశాలున్న సినిమా అని చెప్పారు.

ట్రైల‌ర్‌ ప‌రంగా చెప్పాలంటే, సామాన్యుడు రాక్ స్టార్ ఎలా అయ్యాడు? అత‌ని జీవితంలో ప్రేమ పాత్ర ఎంత‌వ‌రకు వుంది. అనేది చూపించారు.

అనంత‌రం విలేకరుల ప్ర‌శ్న‌ల‌కు గౌత‌మ్ కృష్ణ  స‌మాధాన‌మిస్తూ, నేను డాక్ట‌ర్ అయినా, చిన్న‌ప్ప‌టినుంచి న‌ట‌న అంతే ఇష్టం. మా కుటుంబంలో అంద‌రూ ఎడ్య‌కేట్ ప‌ర్స‌న్స్‌. నా ఇంట్రెస్ట్ చూసిన నాన్న‌గారు డాక్ట‌ర్ పూర్త‌య్యాక న‌ట‌న‌వైపు ర‌మ్మ‌న్నారు. అలాగే చేశాను. నాకు ఎడిటింగ్‌ పైనా ప‌ట్టువుంది. న‌ట‌న‌లో మ‌హేష్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకున్నాను. న‌న్ను నేను నిరూపించుకునేందుకు చేసిన ప్ర‌య‌త్న‌మిది.

–  ట్రైల‌ర్‌ చూశాక‌ అర్జున్ రెడ్డి షేడ్స్ క‌నిపించాయ‌ని అనుకుంటున్నారు. ఇందులో డ్రెగ్ అనే విష‌యం కొన్ని నిముషాల‌పాటే ఉంటుంది. ప్ర‌ధాన‌మైన పాయింట్ టీనేజ్ అబ్బాయి రాక్‌స్టార్ ఎలా అయ్యాడు. అన్న‌ది క‌థే. స్క్రిప్ట్ బేస్డ్ సినిమా.

– నాకు మొద‌టినుంచి ద‌ర్శ‌క‌త్వం బాగా చేయ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం వుంది. కానీ న‌టుడిగా కొంత భ‌య‌ముండేది. అందుకే న‌న్ను నేను ప‌రీక్షించుకోవాల‌ని యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అయి., ఈ పాత్ర‌పై క‌స‌ర‌త్తు చేశాను.

– నా రియ‌ల్ లైఫ్‌ కు ఈ పాత్ర‌కు సంబంధంలేదు. డాక్ట‌ర్‌ చ‌దివేట‌ప్పుడు చాలామందిని ప‌రిశీలించాను. అన్నీ వున్న‌వారు కూడా ఏదో  తెలీని బాధ కొంత‌మందిలో గ్ర‌హించాను. అందుకే వారిని ప‌రిశీలించి చేసిన సినిమా ఇది. పిల్ల‌తో త‌ల్లిదండ్రులు ఫ్రెండ్‌లా వుండాలని చెప్పేదే మా సినిమా. అని అన్నారు.

న‌టుడు అక్ష‌య్ మాట్లాడుతూ, థియేట‌ర్ ఆర్టిస్టుని. అంద‌రం చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాం. మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేయండ‌ని పేర్కొన్నారు.

మ‌రో న‌టుడు ఆనంద్ మాట్లాడుతూ, సెప్టెంబ‌ర్ 2న విడుద‌లువుంది. గౌత‌మ్ ట్రైల‌ర్‌ ను చాలా ప్రామిసింగ్‌ గా చూపించాడు. బ్యూటిఫుల్ ల‌వ్‌స్టోరీ విత్‌ స్ట్ర‌గుల్ ఇందులో క‌నిపిస్తుంది అన్నారు. మ‌రో న‌టుడు విశు ఆచార్య మాట్లాడుతూ,బబ్లూ అనే పాత్ర‌లో న‌టించానన్నారు.

ర‌చ‌యిత ప‌ర‌శురామ్ మాట్లాడుతూ, అశ్వ‌థ్థామ చిత్రానికి మాట‌లు రాశాను. మ‌రికొన్ని సినిమాల‌కు ప‌నిచేశాను. గౌత‌మ్ సూప‌ర్ టాలెంటెడ్.. ఐదేళ్ళ జ‌ర్నీలో చాలా గ్ర‌హించాను. ఈ సినిమాకు ఉడ‌తాభ‌క్తిగా ద‌ర్శ‌కుడికి సాయం చేశాను. గౌత‌మ్ టీం త‌ప‌న ఇందులో క‌నిపిస్తుంది. అన్ని క్రాఫ్ట్‌లు ప‌నిచేయ‌డం గౌత‌మ్ కే సాధ్య‌మ‌యింది అని తెలిపారు.

Tfja Team

Recent Posts

‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ అంటూ సాగే సాంగ్ రిలీజ్

శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…

19 hours ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…

19 hours ago

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

5 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago