బి. గోపాల్ విడుదల చేసిన “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” ట్రైలర్..

సెప్టెంబర్ 2 న గ్రాండ్ రిలీజ్

జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా  చిత్ర ట్రైలర్ ను దర్శకుడు బి. గోపాల్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో  దర్శకులు సాగర్  ప్రసన్న  కుమార్ , యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, పద్మిని నాగులపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్, ఇండస్రిలిస్ట్ జానకిరామ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల  సమావేశంలో

దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ..ఈ సినిమా టైటిల్, సాంగ్స్, ట్రైలర్ అన్ని బాగున్నాయి. ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిసియన్స్ అందరూ  చాలా  హార్డ్ వర్క్ చేశారు. ఈ కథ పై ఉన్న నమ్మకంతో దర్శకుడు వెంకట్ చాలా కాన్ఫిడెంట్ గా తీశాడు. అలాగే ఈ సినిమా కథను, దర్శకుడిని నమ్మి తీసిన నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

ప్రముఖ దర్శకుడు సాగర్ మాట్లాడుతూ..ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి.సినిమా కూడా చాలా బాగుంటుంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2 న థియేటర్ కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..
ఈ సినిమాలోని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక రియాలిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు.ఈ చిత్రానికి నిర్మాతలు కూడా చాలా కష్టపడ్డారు.ఫొటోగ్రఫీ  చూస్తుంటే పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి మాట్లాడుతూ..సినిమా చూశాను  చాలా బాగుంది. దర్శకుడు వెంకట్ కథను చాలా బాగా నేరెట్ చేశాడు. నిర్మాత నాగేశ్వరావుకు సినిమానే ఊపిరి.తనకు హెల్త్ బాగాలేక లేకపోయినా సినిమా కొరకు తను పడే తపన నాకెంతో నచ్చింది. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి రావడం ద్వారా అనేక మందిని నటీనటులు టెక్నిషియన్స్ చిత్ర పరిశ్రమకు పరిచయ మవుతారని అన్నారు

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ..మా ట్రైలర్ విడుదలకు  వచ్చిన దర్శకులు బి. గోపాల్, సాగర్, ప్రసన్న  కుమార్ , యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, శశి ప్రీతమ్ లకు ధన్యవాదాలు. నాకు ఆరోగ్యం బాగా లేదని తెలుసుకొని నాకు సపోర్ట్ గా నిలిచారు యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి గారు వారికీ నా ధన్యవాదాలు.దర్శకుడు వెంకట్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చాను. సంగీత దర్శకుడు సందీప్ ఇందులో ప్రతి సాంగ్ చాలా బాగుండేలా  అద్భుతమైన పాటలు ఇచ్చాడు.ఆ తరువాత హుషారు ఫెమ్ తేజ్ కూరపాటి ని, హీరోయిన్ అఖిల ఆకర్షణ లతో పాటు నటీ, నటులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.ఇందులో నటించిన వారందరూ చాలా చక్కగా నటించారు..అలాగే టెక్నిషియన్స్ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆశీర్వాదించాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన దర్శకులు బి. గోపాల్, సాగర్, ప్రసన్న  కుమార్ , యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, శశి ప్రీతమ్ లకు ధన్యవాదాలు..మా నాన్నకు హెల్త్ బాగా లేకపోయినా వెంకట్ చెప్పిన కథ నచ్చడతో నాతో ఈ సినిమా చేయించాడు.ఈ సినిమా ద్వారా నన్ను నిర్మాతగా పరిచయంచేసిన మా తల్లి తండ్రులు ముల్లేటి నాగేశ్వరావు, జానకి గార్లకు ధన్యవాదములు.ఈ చిత్రాన్ని ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో షూటింగ్ చేయడం జరిగింది. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము.. మా చిత్ర దర్శకుడు వెంకట్ గారు ఈ కథను చాలా బాగా తెరకెక్కించాడు. అలాగే  జి. వి. ఆర్,కృష్ణం రాజు  లు కూడా సపోర్ట్ చేశారు ఇందులో నటించిన హీరో, హీరోయిన్ లకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నాను.ఈ సినిమాకు భవ్య దీప్తి రెడ్డి  మంచి రిలీక్స్ ఇచ్చారు. అలాగే పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గారు, బస్టాప్ కోటేశ్వరరావు, అనంత్ ఇలా అందరూ బాగా నటించడమే కాకుండా వారంతా సపోర్ట్ చేయడం వలెనే సినిమా బాగా వచ్చింది. టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు  వెంకట్ వందెల మాట్లాడుతూ..మా సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నేను చెప్పిన కథ నచ్చగానే  ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్న నిర్మాతలకు ధన్యవాదములు. ఇది ఒక అందమైన రియాలిస్టిక్ ప్రేమ కథ. ఓసో లోని తత్త్వం, బుద్ధుని  లోని సహనం, శ్రీ శ్రీ లోని రేవలిజం, వివేకానందుడి లోని గుణం వుండేలా తనికెళ్ళ భరణి గారి  క్యారెక్టర్  ను డైజైన్ చేయడం జరిగింది..వారితో పాటు  ఈ చిత్రానికి పని చేసిన హీరో, హీరోయిన్స్  టెక్నిషియన్స్, నటులు అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే యం.ఆర్. సి.వడ్ల పట్ల చౌదరి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

చిత్ర హీరోయిన్ అఖిల  మాట్లాడుతూ..దర్శకుడు చెప్పిన  కథ నాకెంతో నచ్చింది. ఈ కథ లో  హీరోయిన్ కు మంచి స్కోప్ ఉందనుకొని ఈ సినిమా చేశాను.సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.

చిత్ర హీరో తేజ్ కూర‌పాటి మాట్లాడుతూ.. మా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. ఈ సినిమా 2 మంత్స్ లోనే షూట్ అయిపోయింది.మా నిర్మాతలు థి యేటర్స్ లలో  రిలీజ్ చేద్దాం అనుకున్న టైమ్ లో కోవిడ్ రావడంతో డిలే అయ్యింది. మొదటి సారి సోలో హీరో గా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ.. ఇంతమంది పెద్దలు వచ్చి బ్లెస్స్ చేసిన ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి. నిర్మాత ముల్లేటి నాగేశ్వ‌రావు కూతురు ఈ సినిమా ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీకి వస్తున్నందుకు తనకు వెల్ కం చెపుతూ  సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ మాట్లాడుతూ.. దర్శక, నిర్మాతలకు ఈ కథ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో  ఎంతో కష్టపడి  నిర్మించిన ఈ సినిమా బిగ్ సక్సెస్ అయ్యి పెద్ద సినిమాగా నిలవాలని కోరుతున్నాను అన్నారు

న‌టీన‌టులు:

తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నా రెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌లురు న‌టించ‌గా

టెక్నికల్ టీం:

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. ముల్లేటి నాగేశ్వ‌రావు
నిర్మాత‌లు.. ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు
క‌థ‌-స్క్రీన్‌ప్లే- మాటలు ద‌ర్శ‌క‌త్వం.. వెంక‌ట్ వందెల‌
సినిమాటోగ్ర‌ఫి.. పి.వంశి ప్ర‌కాష్‌
సంగీతం.. సందీప్ కుమార్‌
స్క్రీన్‌ప్లే- పాట‌లు.. డాక్ట‌ర్ భ‌వ్య ధీప్తి రెడ్డి
ఎడిట‌ర్‌.. నంద‌మూరి హరి
స్టంట్స్‌.. రామ కృష్ణ‌
కొరియోగ్ర‌ఫి.. గ‌ణేష్‌ మాస్టర్, నండిపు రమేష్

పి .ఆర్. ఓ :  మధు వి. ఆర్

Tfja Team

Recent Posts

‘మన డాక్టర్ బాబే’ చిత్రం నుంచి ‘సోగ్గాడిలా’ అంటూ సాగే సాంగ్ రిలీజ్

శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…

20 hours ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…

20 hours ago

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

5 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago