మాస్ రాజా రవితేజ చేతుల మీదుగా సంజయ్ రావ్ “స్లమ్ డాగ్ హజ్బెండ్” బరాత్ సాంగ్ రిలీజ్

సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న కామికల్ ఎంటర్ టైనర్ సినిమా “స్లమ్ డాగ్ హజ్బెండ్”. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. తాజాగా “స్లమ్ డాగ్ హజ్బెండ్” సినిమా నుంచి బరాత్ సాంగ్ ను మాస్ రాజా రవితేజ విడుదల చేశారు. పాటలో చాలా జోష్ ఉందని, పాటతో పాటు సినిమా కూడా హిట్ అవ్వాలని మూవీ టీమ్ కు విశెస్ తెలిపారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే…లచ్చి గాని పెళ్లి ఇగ పార్శి గుట్టల లొల్లి. లచ్చిగాని పెళ్లి నువు మర్పా కొట్టర మళ్లీ..అంటూ సాగే ఈ పాట బరాత్ సాంగ్ ఆఫ్ సెంచరీ గా నిలవనుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా..భీమ్స్ సిసిరోలియో స్వరపర్చి పాడారు. బరాత్ సందడి, ఉత్సాహం అంతా ఈ పాటలో కనిపించింది. సినిమా ఎంత మాస్ ఎంటర్ టైనర్ గా ఈ పాట ఉంటుందో తెలియజేస్తోంది.

ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ – వైష్ణవ్ వాసు, సినిమాటోగ్రఫీ – శ్రీనివాస్ జె రెడ్డి, సంగీతం – భీమ్స్ సిసిరోలియో, సాహిత్యం – కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి, పీఆర్వో – జీఎస్కే మీడియా, లైన్ ప్రొడ్యూసర్ – రమేష్ కైగురి, బిజినెస్ హెడ్ : కొ వె ర, సహ నిర్మాతలు – చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం, నిర్మాతలు – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రచన దర్శకత్వం – డాక్టర్ ఏఆర్ శ్రీధర్.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago