ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ `కొత్త కొత్తగా’. బి జి గోవింద రాజు చిత్రాన్ని సమర్పించారు. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
అజయ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి నేను కొత్త. సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో అంచనాలేదు. కానీ మా దర్శకుడు ఈ విజయాన్ని ముందే ఊహించారు. ఇప్పుడు చాలా జోష్ లో వున్నాను. ఇంత మంచి కథతో లాంచ్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నన్ను ఉదయ్ కిరణ్ అని ప్రసంసిస్తున్నారు. ఇంతమంచిగా చూపించిన మా డీవోపీ కి థాంక్స్. యూత్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రియతమా పాటని. ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది” అన్నారు
వీర్తి మాట్లాడుతూ.. ఈ సినిమాని ఆదరించి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం ఎంతో సహకరించిన అజయ్ కి థాంక్స్. ఈ సినిమాని ఇంకా చూడని వారు దయచేసి థియేటర్ లో చూడండి. తప్పకుండా నచ్చుతుంది” అన్నారు
దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ.. వర్షాలు, వినాయక నిమజ్జనం వున్నా కూడా ప్రేక్షకుల నుండి తొలి రోజు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రేక్షకులు చాలా ఆనందంగా ఫీలౌతున్నారు. మంచి రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాని చాలా బావుంది. వర్డ్ అఫ్ మౌత్ తో సినిమా మరింత ముందుకు వెళ్తుందనే నమ్మకం వుంది” అన్నారు
నిర్మాత మాట్లాడుతూ.. సినిమాకి అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము అనుకున్న దాని కంటే ఎక్కువ ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. పంపిణీదారులు ఆనందంగా వున్నారు. కొత్తకొత్తగా కొత్త అనుభూతిని ఇచ్చే సినిమాని. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లో చూడాలి” అని కోరారు
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…