కీర్తి సురేష్, నవీన్ కృష్ణ జంటగా రూపొందిన చిత్రం `జానకిరామ్`. బేబీ శ్రేయారెడ్డి సమర్పణలో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై రాంప్రసాద్ రగుతు దర్శకత్వంలో తమటం కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ….“ఇటీవల విడుదల చేసిన మా చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. హ్యుమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్ గారి తనయుడు నవీన్ కృష్ణ హీరోగా నటించాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం. అచ్చు రాజమణి గారు ఏడు అద్భుతమైన పాటలు కంపోజ్ చేశారు. మెగాబ్రదర్ నాగబాబు గారు కీలకమైన పాత్రలో నటించారు. కీర్తి సురేష్ , నవీన్ కృష్ణ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కీర్తి సురేష్ అందం, అభినయంతో పాటు నవీన్ కృష్ణ పర్పార్మెన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కృష్ణ వంశీ గారి లాంటి పెద్ద దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన రాంప్రసాద్ రగుతు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో సప్తగిరి, పోసాని, రాహుల్ దేవ్ , రఘు కారుమంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించారు. మరో ఇంపార్టెంట్ రోల్ లో చాందిని నటించింది. త్వరలో సినిమా విడదుల తేదీ ప్రకటిస్తాం“ అన్నారు.
కీర్తి సురేష్, నవీన్ కృష్ణ, చాందిని, పోసానికృష్ణ మురళి, నాగబాబు, రాహుల్ దేవ్, సప్తగిరి, రాఘవ, రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః అచ్చు రాజమణి, డిఓపీః సురేష్ రగుతు; పీఆర్వోః రమేష్ చందు; డైలాగ్స్ః సురేష్ వర్ధినేది; కో-ప్రొడ్యూసర్ః టి.రమేష్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః పవన్ రెడ్డి కోటిరెడ్డి; నిర్మాతః తమటం కుమార్ రెడ్డి; డైరక్టర్ః రామ్ ప్రసాద్ రగుతు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…