వెర్సటైల్ హీరో నాగశౌర్య డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’ రెండు వారాల్లోపు థియేటర్ లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్, పాటలు యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ వినోదం, గ్లామర్, రొమాన్స్, యాక్షన్, భావోద్వేగాలతో ఆకట్టుకుంది.
కృష్ణ (నాగ శౌర్య) అగ్రహారం బ్రాహ్మణ కుర్రాడు, ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం సంపాదించి సిటీకి వస్తాడు, అక్కడ అందమైన అమ్మాయి వ్రింద (షిర్లీ సెటియా)ని కలుస్తాడు. వ్రింద ని ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని ఆకర్షించడానికి కృష్ణ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వారిద్దరూ కలసి ప్రతి క్షణాన్ని ఆనందిస్తారు. కృష్ణది సనాతన కుటుంబం, వ్రింద మోడరన్ దుస్తులు ధరించే అర్బన్ గర్ల్. ఇది కాకుండా వీరి పెళ్లికి మరో సమస్య వుందని ట్రైలర్ చూస్తూనే అర్ధమౌతుంది.
నాగ శౌర్య ఫెర్ఫార్మెన్స్, కామిక్ టైమింగ్ అవుట్ స్టాండింగ్ గా ఉంది. బ్రాహ్మణ గెటప్‌లో సాంప్రదాయకంగా కనిపిస్తూనే,.. ఫార్మల్స్, ఫ్యాషన్ కాస్ట్యూమ్స్‌లో సూపర్ కూల్, ట్రెండీగా ఉన్నాడు. షిర్లీ సెటియా గ్లామరస్‌గా కనిపించింది. వీరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రాధికా శరత్ కుమార్ తల్లిగా కనిపించింది. వెన్నెల కిషోర్ కోమాలో ఉన్నప్పటికీ తన ప్రజన్స్ ని చాటుకున్నాడు. బ్రహ్మాజీ కెఎఫ్‌సి సీక్వెన్స్ హిలేరియస్ గా ఉంది. రాహుల్ రామకృష్ణ, సత్య కూడా వినోదాన్ని పంచారు.
దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ కామెడీని బాగా హ్యాండిల్ చేయగలడు. ట్రైలర్ పూర్తిగా హ్యుమర్ తో ఆకట్టుకుంది. ఫ్యామిలీతో పాటు యువతను ఆకర్షించే ఎలిమెంట్స్ వున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నీట్ గా వుంది. మహతి స్వర సాగర్ తన మ్యాజికల్ మ్యూజిక్‌తో వినోదాన్ని ,ఎమోషన్స్ ని పెంచాడు. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్ లో ఉన్నాయి. టీజర్ మంచి అంచనాలనుపెంచగా, ట్రైలర్ ఇప్పుడు అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.
శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: అనీష్ ఆర్. కృష్ణ
నిర్మాత: ఉషా ముల్పూరి
సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి
బ్యానర్: ఐరా క్రియేషన్స్
సంగీతం: మహతి స్వరసాగర్
డివోపీ: సాయిశ్రీరామ్
సహ నిర్మాత: బుజ్జి
ఎడిటర్ – తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ – రామ్ కుమార్
డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్
పీఆర్వో: వంశీ, శేఖర్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…