శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఆర్య ‘కెప్టెన్’…తెలుగులో విడుదల

కోలీవుడ్ స్టార్ ఆర్య కథానాయకుడిగా నటించిన సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. 

ఆర్య, దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ కలయికలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ ‘టెడ్డీ’ సినిమా చేశారు. ‘కెప్టెన్’ విషయానికి వస్తే… వినూత్న కథాంశంతో సినిమా రూపొందింది. ఈ రోజు ఉదయం యూత్ స్టార్ నితిన్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. 

‘కెప్టెన్’లో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశారు ఆర్య. కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రలో నటించారు. ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఉంది. రెగ్యులర్ ఆర్మీ బేస్డ్ సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో హాలీవుడ్ స్థాయిలో సినిమా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఒక అడవిలో వింత జీవులను ఎదుర్కోవడానికి హీరో అండ్ టీమ్ వెళ్ళినప్పుడు ఏమైందనేది కథగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆర్య జోడీగా ఐశ్వర్య లక్ష్మి కనిపించారు. 

మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, భరత్ రాజ్, ఆదిత్యా మీనన్, సురేష్ మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. మాధవన్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎస్. శివ కుమార్, సౌండ్ డిజైన్ : అరుణ్ శీను, సౌండ్ మిక్స్ : తపస్య నాయక్, కలరిస్ట్ : శివ శంకర్ .వి, వీఎఫ్ఎక్స్‌ సూపర్ వైజర్ : వి. అరుణ్ రాజ్, కాస్ట్యూమ్ డిజైనర్ : దీపాలీ నూర్, స్టంట్ డైరెక్టర్ : ఆర్. శక్తి శరవణన్, కె. గణేష్, ప్రొడక్షన్ డిజైన్ : ఎస్.ఎస్. మూర్తి, ఎడిటర్ : ప్రదీప్ ఇ. రాఘవ్, సినిమాటోగ్రఫీ : ఎస్. యువ, మ్యూజిక్ : డి ఇమాన్, రచన – దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago