శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా మిథున ఎంటర్‌టైన్‌మెట్స్ ప్రై.లి, సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎం.ఎం. అర్జున్ నిర్మాత. థ్రిల్లింగ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి సెకెండ్ సాంగ్ ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎం.అర్జున్ మాట్లాడుతూ ‘‘సతీష్ కథ చెప్పగానే బాగా నచ్చింది. ఆయన సినిమాను నెరేట్ చేసిన దాని కంటే చక్కగా తెరకెక్కించారు. ఓ మంచి సినిమాను రూపొందించడంలో నిర్మాతగా నా వంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించాను. హీరో హీరోయిన్లు శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన చక్కగా నటించారు. యూనివర్సల్ పాయింట్ కావటంతో సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన తొలి లిరికల్ సాంగ్ కి మంచి స్పందన వచ్చింది. దాంతో శనివారం సెకెండ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశాం. ఈ సాంగ్ ని ప్రముఖ గాయకుడు, రచయిత పెంచలదాస్ రాసి… ఆలపించారు. గతంలో ఆయన పాడిన అరవింద సమేత, కృష్ణార్జున యుద్ధం చిత్రాల సాంగ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో… ఈ సాంగ్ కి అంతే స్థాయిలో పేరు రావడం ఖాయం. త్వరలోనే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు.
ఇక దర్శకుడు సతీష్ బత్తుల మాట్లాడుతూ ‘‘‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ చిత్రం డిఫరెంట్ లవ్ ఎంటర్‌టైనర్. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. నిర్మాత మల్లికార్జున్‌గారి సపోర్ట్ లేకపోతే ఇంత దూరం రాగలిగే వాళ్లం కాదు. మేకింగ్‌లో మల్లికార్జున్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. పాన్ ఇండియా మూవీగా సినిమా రిలీజ్‌కి సన్నద్ధమవుతుంది. శివ, ఉమయ, దేవీప్రసాద్, మాధవీలత ఇలా మంది ఆర్టిస్టులు ఇందులో నటించారు. కార్తీక్ మ్యూజిక్ అందించగా, ఆరీఫ్ సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు. ఇలా ఈ సినిమాకి చాలా అనుభవం వున్న సాంకేతిక నిపుణులు పని చేశారు. దాంతో సినిమా చాలా బాగా వచ్చింది. పెంచలదాస్ రాసి, పాడిన పాటకి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
నటీనటులు:
శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన
సాంకేతిక వర్గం:
బ్యానర్స్: మిథున ఎంటర్‌టైన్‌మెట్స్ ప్రై.లి, సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్
కో ప్రొడ్యూసర్స్: విశ్వనాథ్.ఎం, హరి కుమార్.జి, కమల్ మేడగోని
సంగీతం : కార్తీక్ కొడగండ్ల
నిర్మాత : ఎం.ఎం.అర్జున్
రచన, దర్శకత్వం : సతీష్ బత్తుల
PRO: వంగాల కుమారస్వామి (Boxoffice)
శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేందర్…
Under the banner of Sri Naarasimha Chitralaya, the film "Marrichettu Kinda Manollu" was officially launched…
తన తొలి మూవీ ‘మేం ఫేమస్’తో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా తన…
Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…
Aaron Taylor-Johnson is arguably one of the fittest stars out there and his physical transformation…