– ఈ షో ద్వారా ఓ టి టి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఓంకార్
డాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్ బయటికొస్తారు. కానీ అందులోంచి ఆణిముత్యాలని వెతికి, వారి ప్రతిభను లోకానికి చూపించడానికి ‘డాన్స్ ఐకాన్’ షో తో వచ్చేస్తుంది మన అందరికి ఎంతో ఇష్టమైన, 100 % లోకల్ ఓ టి టి ప్లాట్ ఫామ్ ఆహ. ఎప్పుడూ తన అభిమానులని ఎలా అలరించాలని ఆలోచించే ఆహ,తెలుగు ఇండియన్ ఐడల్ సక్సెస్ తర్వాత మరోసారి ప్రతిభ ఉన్న నృత్యకళాకారులతోటి వచ్చేస్తుంది. తెలుగు లోగిల్లలో అన్నయ్యా అని పిలవబడే ఓంకార్ ఈ షో కి యాంకర్ మరియు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో యొక్క ఫస్ట్ లుక్ ను ఆహ 20 ఆగష్టు నాడు విడుదల చేసింది.
Link – https://www.youtube.com/watch?v=qk8kT9NvONc&feature=youtu.be
ఈ షో యాంకర్ మరియు ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ, “ఈ షో ద్వారా నేను ఓటిటి ప్లాట్ఫామ్ లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహా కు ధన్యవాదములు. నేను ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను, కానీ ఇది చాల డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ షో కంటెస్టెంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్స్ జీవితాల్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ యొక్క కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో కి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అందరు ఈ షో ని ఆదరిస్తారని భావిస్తున్నాను.”
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…