‘డ్యాన్స్ ఐకాన్’ షో ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన ఆహ

Must Read

– ఈ షో ద్వారా ఓ టి టి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఓంకార్

డాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్ బయటికొస్తారు. కానీ అందులోంచి ఆణిముత్యాలని వెతికి, వారి ప్రతిభను లోకానికి చూపించడానికి ‘డాన్స్ ఐకాన్’ షో తో వచ్చేస్తుంది మన అందరికి ఎంతో ఇష్టమైన, 100 % లోకల్ ఓ టి టి ప్లాట్ ఫామ్ ఆహ. ఎప్పుడూ తన అభిమానులని ఎలా అలరించాలని ఆలోచించే ఆహ,తెలుగు ఇండియన్ ఐడల్ సక్సెస్ తర్వాత మరోసారి ప్రతిభ ఉన్న నృత్యకళాకారులతోటి వచ్చేస్తుంది. తెలుగు లోగిల్లలో అన్నయ్యా అని పిలవబడే ఓంకార్ ఈ షో కి యాంకర్ మరియు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో యొక్క ఫస్ట్ లుక్ ను ఆహ 20 ఆగష్టు నాడు విడుదల చేసింది.

Link – https://www.youtube.com/watch?v=qk8kT9NvONc&feature=youtu.be

ఈ షో యాంకర్ మరియు ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ, “ఈ షో ద్వారా నేను ఓటిటి ప్లాట్ఫామ్ లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహా కు ధన్యవాదములు. నేను ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను, కానీ ఇది చాల డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ షో కంటెస్టెంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్స్ జీవితాల్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ యొక్క కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో కి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అందరు ఈ షో ని ఆదరిస్తారని భావిస్తున్నాను.”

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News