ఐ.ఎ.స్ కోచింగ్ కొరకు విద్యార్థినికి మైక్ మూవీస్ ప్రొడ్యూసర్ ఆర్థిక చేయూత

Must Read


సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని‌ స్థానిక చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన లకావత్ రామారావు (late) కుమార్తె లావణ్య UPSC, IAS పోటీ పరీక్షలకు తర్ఫీదు తీసుకుంటుంది, ఆర్థిక ఇబ్బందులు పేద విద్యార్థుల‌ ప్రతిభకు సమస్య కాకూడదని తన కోచింగ్ ఫీజుల‌‌ నిమిత్తం వర్క్ కాగ్ కంపెనీ అధినేత అన్నపురెడ్డి‌‌ అప్పి రెడ్డి గారు మరియు కార్పోరేట్ సామాజిక బాధ్యత ( సి. యస్. ఆర్ ) ప్రోగ్రామ్ తరపున ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.

పేద విద్యార్థుల చదువుల కొరకు, ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత శిఖరాలు చేర్చడానికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్క్ కాగ్ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డి గారు, చక్రధర్ గారు, హీరో సోహెల్, శ్రీనివాస్ రెడ్డి, రవి సజ్జల, చరిత్ జూలూరి మరియు తదితరులు పాల్గొన్నారు. తనకు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రోత్సహించిన అప్పి రెడ్డి గారికి తను ఎప్పుడూ రుణపడి ఉంటానని విద్యార్థిని లకావత్ లావణ్య పేర్కొన్నారు.

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News