ZEE5‘తలమై సెయల్గమ్’లో ప్రధాన పాత్రధారిగా ‘సలార్’ ఫేమ్ శ్రియారెడ్డి

  • జాతీయ అవార్డ్ గ్ర‌హీత వ‌సంత్ బాల‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సిరీస్‌ను రూపొందించిన రాధికా శ‌ర‌త్‌కుమార్‌… మే 17 నుంచి ZEE5లో స్ట్రీమింగ్‌
  • ప్ర‌ధాన తారాగ‌ణంగా శ్రియారెడ్డి, కిషోర్‌, ఆదిత్య మీన‌న్‌, భ‌ర‌త్

మే 4, నేష‌న‌ల్: భార‌త‌దేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మం ZEE5. ప‌లు భాష‌ల్లో వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు అప‌రిమిత‌మైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్ర‌మంలో స‌రికొత్త పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళ రాజ‌కీయాల్లో అధికార దాహాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందింది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటిక‌ల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై జాతీయ అవార్డ్ గ్ర‌హీత వ‌సంత‌బాల‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రాధికా శ‌ర‌త్ కుమార్ రూపొందించారు. ఇందులో కిషోర్‌, శ్రియారెడ్డి, ఆదిత్య మీన‌న్‌, భ‌ర‌త్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. తమిళనాడులో రాజకీయాల మధ్య ఒక మహిళ అధికార దాహం, ఆశయం, ద్రోహం, విమోచనల‌ను తెలియ‌జేసే క‌థాంశంతో ఇది తెర‌కెక్కింది.

ఇది త‌మిళ రాజ‌కీయాల చుట్టూ న‌డిచే క‌థాంశం. ముఖ్య‌మంత్రి అరుణాచ‌లం అవినీతి ఆరోప‌ణ‌ల‌తో 15 సంవ‌త్స‌రాలుగా విచార‌ణ‌ను ఎదుర్కొంటుంటారు. ముఖ్య‌మంత్రి కావాల‌ని, ఆ ప‌ద‌వి కోసం వారిలో ఇది కోరిక‌ను మ‌రింత‌గా పెంచుతుంది. ఇదిలా ఉండ‌గా జార్ఖండ్‌లోని మారుమూల ప‌ల్లెటూరులో, రెండు ద‌శాబ్దాల క్రితం జ‌రిగిన పాత మ‌ర్డ‌ర్ కేసుని సీబీఐ ఆఫీస‌ర్ వాన్ ఖాన్ ప‌రిశోధిస్తుంటారు. అదే స‌మ‌యంలో చెన్న నగ‌నంలో త‌ల‌, శ‌రీర‌భాగాలు వేరు చేయ‌బ‌డిన ఓ శ‌రీరం దొరుకుతుంది. ఈ భ‌యంక‌ర ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిని క‌నిపెట్ట‌టానికి చెన్నై డీజీపీ మ‌ణికంద‌న్ ప‌రిశోధ‌న చేస్తుంటారు. క్ర‌మ‌క్ర‌మంగా న‌గ‌రంలో జ‌ర‌ర‌గుతున్న ఈ దుర్ఘ‌ట‌న‌ల వెనుకున్న నిజ‌మేంట‌నేది బ‌య‌ట‌కు వ‌స్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

రాడాన్ మీడియా వ‌ర్క్స్ అధినేత, నిర్మాత రాధికా శ‌ర‌త్ కుమార్ మాట్లాడుతూ ‘‘‘తలమై సెయల్గమ్’ సిరీస్‌ను జీ 5తో క‌లిసి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు అందించ‌టం చాలా సంతోషంగా అనిపిస్తుంది. జాతీయ రాజ‌కీయాల్లో త‌మిళ‌నాడు రాజ‌కీయాల ప్ర‌భావంతో పాటు జార్ఖండ్‌లోని కింది స్థాయి కార్య‌కర్త‌లు, తిరుగుబాటు గ్రూపుల మ‌ధ్య ఉండే సంక్లిష్ట ప‌రిస్థితుల‌ను ఇది తెలియ‌జేస్తుంది. రాజకీయ వార‌స‌త్వానికి అతీతంగా ఓ మ‌హిళ అధికారంలోకి వ‌స్తే ఏం జ‌రుగుతుంద‌నే ప‌రిస్థితుల‌పై సిరీస్‌ను రూపొందించారు. కొట్ర‌వై, దుర్గ‌, అభిరామి అనే మూడు పాత్ర‌లు, వాటి వెనుకున్న బ‌ల‌మైన భావోద్వేగాల‌ను, భావ‌జాలాల‌ను రూపొందించ‌టంలో ఉండే మ‌హిళ కీల‌క పాత్ర‌ల‌ను త‌ల‌మై సెయ‌ల్గ‌మ్ తెలియ‌జేస్తుంది.

డైరెక్ట‌ర్ వ‌సంత‌బాల‌న్ మాట్లాడుతూ ‘‘రాజకీయాల్లో ఏ నియాలు వ‌ర్తించ‌వు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గొంతులను నిశితంగా విన్న‌ప్పుడు.. రాష్ట్ర స్వయంప్రతిపత్తి, రాష్ట్ర స్వయం సమృద్ధి, ప్రజల హక్కుల ప్రాథమిక అవసరానికి గొంతుకగా అవి మారాయని అర్థం చేసుకున్నప్పుడు కొత్త రాజకీయం పుట్టుకొస్తుంది. అవినీతి, దీని కార‌ణంగా జ‌రిగే ప్ర‌మాదాలు, దీన్ని ఎదుర్కోవ‌టం కోసం చేసే పోరాటాల్లో భాగ‌మై ప్ర‌జ‌ల సంక్షేమాన్ని ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రిని గురించి తెలియ‌జేస్తుంది’’ అన్నారు.

న‌టి శ్రియా రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇందులో నేను కొట్ర‌వై అనే పాత్ర‌లో క‌నిపిస్తాను. ఇలాంటి ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన సిరీస్‌లో భాగం కావ‌టం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వైవిధ్య‌మైన షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌టం అనేది న‌టిగా నాకు ఛాలెజింగ్‌గా అనిపించింది. మ‌నం మ‌న శ‌త్రువుకు ఎదురుగా క‌త్తితో నిల‌బ‌డ్డ‌ప్పుడు వాళ్లు మ‌న‌పై మ‌రిన్ని క‌త్తుల‌ను ప్ర‌యోగిస్తారు అనే సిద్ధాంతాన్ని న‌మ్మే పాత్రే నాది. ప్ర‌తీ విష‌యంలో ఓ లెక్క‌తో, సామ‌ర్థ్యంతో, ఎలాంటి చ‌డీ చ‌ప్పుడూ లేకుండా, న‌మ్మ‌కంతో త‌న ప‌నిని తాను చేసుకునే పాత్రే కొట్ర‌వైది. అస్థిర‌మైన రాజ‌కీయాలు, మ‌న వెనుక జ‌రిగే చీక‌టి ద‌ర్యాప్తులు, కుటుంబాల్లోని క‌ల‌హాలు, ప్ర‌మాద‌క‌ర‌మైన స్నేహాలతో పాటు త‌మిళనాట రాజ‌కీయాల‌ను ఇది తెలియజేస్తుంది. నేను కూడా జీ5లో త‌ల‌మై సెయ‌ల్గ‌మ్‌ను చూడ‌టానికి ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

  • మే 17 నుంచి ZEE5లో ‘తలమై సెయల్గమ్’ స్ట్రీమింగ్ అవుతుంది. ZEE5 గురించి…

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

13 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago