మే 4, నేషనల్: భారతదేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్యమం ZEE5. పలు భాషల్లో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్రమంలో సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందింది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై జాతీయ అవార్డ్ గ్రహీత వసంతబాలన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్ రూపొందించారు. ఇందులో కిషోర్, శ్రియారెడ్డి, ఆదిత్య మీనన్, భరత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడులో రాజకీయాల మధ్య ఒక మహిళ అధికార దాహం, ఆశయం, ద్రోహం, విమోచనలను తెలియజేసే కథాంశంతో ఇది తెరకెక్కింది.
ఇది తమిళ రాజకీయాల చుట్టూ నడిచే కథాంశం. ముఖ్యమంత్రి అరుణాచలం అవినీతి ఆరోపణలతో 15 సంవత్సరాలుగా విచారణను ఎదుర్కొంటుంటారు. ముఖ్యమంత్రి కావాలని, ఆ పదవి కోసం వారిలో ఇది కోరికను మరింతగా పెంచుతుంది. ఇదిలా ఉండగా జార్ఖండ్‌లోని మారుమూల పల్లెటూరులో, రెండు దశాబ్దాల క్రితం జరిగిన పాత మర్డర్ కేసుని సీబీఐ ఆఫీసర్ వాన్ ఖాన్ పరిశోధిస్తుంటారు. అదే సమయంలో చెన్న నగనంలో తల, శరీరభాగాలు వేరు చేయబడిన ఓ శరీరం దొరుకుతుంది. ఈ భయంకర ఘటనకు కారకులైన వారిని కనిపెట్టటానికి చెన్నై డీజీపీ మణికందన్ పరిశోధన చేస్తుంటారు. క్రమక్రమంగా నగరంలో జరరగుతున్న ఈ దుర్ఘటనల వెనుకున్న నిజమేంటనేది బయటకు వస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
రాడాన్ మీడియా వర్క్స్ అధినేత, నిర్మాత రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ ‘‘‘తలమై సెయల్గమ్’ సిరీస్‌ను జీ 5తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అందించటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. జాతీయ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాల ప్రభావంతో పాటు జార్ఖండ్‌లోని కింది స్థాయి కార్యకర్తలు, తిరుగుబాటు గ్రూపుల మధ్య ఉండే సంక్లిష్ట పరిస్థితులను ఇది తెలియజేస్తుంది. రాజకీయ వారసత్వానికి అతీతంగా ఓ మహిళ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనే పరిస్థితులపై సిరీస్‌ను రూపొందించారు. కొట్రవై, దుర్గ, అభిరామి అనే మూడు పాత్రలు, వాటి వెనుకున్న బలమైన భావోద్వేగాలను, భావజాలాలను రూపొందించటంలో ఉండే మహిళ కీలక పాత్రలను తలమై సెయల్గమ్ తెలియజేస్తుంది.
డైరెక్టర్ వసంతబాలన్ మాట్లాడుతూ ‘‘రాజకీయాల్లో ఏ నియాలు వర్తించవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గొంతులను నిశితంగా విన్నప్పుడు.. రాష్ట్ర స్వయంప్రతిపత్తి, రాష్ట్ర స్వయం సమృద్ధి, ప్రజల హక్కుల ప్రాథమిక అవసరానికి గొంతుకగా అవి మారాయని అర్థం చేసుకున్నప్పుడు కొత్త రాజకీయం పుట్టుకొస్తుంది. అవినీతి, దీని కారణంగా జరిగే ప్రమాదాలు, దీన్ని ఎదుర్కోవటం కోసం చేసే పోరాటాల్లో భాగమై ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వం, ముఖ్యమంత్రిని గురించి తెలియజేస్తుంది’’ అన్నారు.
నటి శ్రియా రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇందులో నేను కొట్రవై అనే పాత్రలో కనిపిస్తాను. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన సిరీస్‌లో భాగం కావటం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించటం అనేది నటిగా నాకు ఛాలెజింగ్‌గా అనిపించింది. మనం మన శత్రువుకు ఎదురుగా కత్తితో నిలబడ్డప్పుడు వాళ్లు మనపై మరిన్ని కత్తులను ప్రయోగిస్తారు అనే సిద్ధాంతాన్ని నమ్మే పాత్రే నాది. ప్రతీ విషయంలో ఓ లెక్కతో, సామర్థ్యంతో, ఎలాంటి చడీ చప్పుడూ లేకుండా, నమ్మకంతో తన పనిని తాను చేసుకునే పాత్రే కొట్రవైది. అస్థిరమైన రాజకీయాలు, మన వెనుక జరిగే చీకటి దర్యాప్తులు, కుటుంబాల్లోని కలహాలు, ప్రమాదకరమైన స్నేహాలతో పాటు తమిళనాట రాజకీయాలను ఇది తెలియజేస్తుంది. నేను కూడా జీ5లో తలమై సెయల్గమ్‌ను చూడటానికి ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…
The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…