హైదరాబాద్, జూలై 29, 2024 –
గత వీకెండ్ లో ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారమైన తాజా ఎపిసోడ్‌లో రజనీ శ్రీ పూర్ణిమ ఎలిమినేట్ కావడంతో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో కాంపిటేషన్ డ్రమటిక్ టర్న్ తీసుకుంది.
జూన్ 14, 2024న ప్రీమియర్ ప్రసారం చేసినప్పటినుండి, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 వరుస ఎలిమినేషన్‌లను జరుగుతున్నాయి, షో నుండి ఎలిమెంట్ అయిన మూడవ కంటెస్టెంట్ గా రజనీ శ్రీ పూర్ణిమ నిలిచింది. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకుల ఓట్లు, న్యాయనిర్ణేతల స్కోర్‌ల ద్వారా నిర్ణయించారు. ఈ సీజన్‌లో ముందుగా కంటెస్టెంట్స్ కుశాల్ శర్మ, హరి ప్రియ ఎలిమినేట్ అయ్యారు.
శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేసిన ఇటీవలి ఎలిమినేషన్ రౌండ్‌లో, శ్రీ ధృతి, స్కందతో పాటు రజని శ్రీ పూర్ణిమ, వారి తక్కువ స్కోర్‌ల కారణంగా డేంజర్ జోన్‌లో ఉన్నారు. స్కంద అత్యధిక ఓట్లను సాధించి ఫస్ట్ సేఫ్ అయ్యాడు. ఎలిమినేషన్ వార్ లో రజని శ్రీ పూర్ణిమ, శ్రీ ధృతి నిలిచరు, అంతిమంగా, రజనీ శ్రీ పూర్ణిమ అతి తక్కువ ఓట్లు పొంది ఎలిమెంట్ అయ్యారు.
ఆమె ఎలిమినేషన్ తర్వాత, జుద్జ్ కార్తీక్ ఆమె ఎలిమినేషన్ పై రిగ్రెట్ అయ్యారు, మ్యూజిక్ ని కొనసాగించమని ప్రోత్సహించారు. భవిష్యత్తులో ఆమెను తన స్టూడియోలో చూస్తారని వాగ్దానం చేశారు. జడ్జి గీతా మాధురి ప్రోత్సాహకరమైన మాటలు అందించారు, ఆమె ప్రేరణతో ఉండాలని, ఆమె సంగీత ప్రయాణాన్ని కొనసాగించాలని కోరారు.
జడ్జి ఎస్ థమన్ భవిష్యత్తులో రజనీ శ్రీ పూర్ణిమతో కలిసి పనిచేయాలనే తన కోరికను తెలియజేశారు, ఆమె వాయిస్ సరిపోయే పాట వస్తే ఆమెను దృష్టిలో ఉంచుకుంటానని, అవకాశం ఇస్తానని చెప్పారు “మీరందరూ మా హృదయాలకు, చెవులకు చాలా దగ్గరగా ఉన్నారు. స్ట్రాంగ్ గా వుండండి, కష్టపడండి” చెప్పారు.
ప్రత్యేక అతిథి గా వచ్చిన డ్రమ్స్ శివమణి రజనీ శ్రీ పూర్ణిమ ట్యాలెంట్ ని కొనియాడుతూ.. ‘‘నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది’ అన్నారు
తోటి కంటెస్టెంట్స్ ఎమోషనల్ గా వీడ్కోలు పలికారు. రజనీ శ్రీ పూర్ణిమ ఎలిమినేషన్ తో, పోటీ వేడెక్కింది, మొదటి స్థానం కోసం తొమ్మిది మందికంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. షోలో పబ్లిక్ ఓటింగ్, న్యాయనిర్ణేతల స్కోర్‌ల ఆధారంగా వీక్లీ ఎలిమినేషన్‌లను కొనసాగుతుంది, వైల్డ్ కార్డ్ అదనపు ఉత్సాహాన్ని జోడించే అవకాశం ఉంది.
వీక్షకులు ఆహా యాప్ ద్వారా లేదా ప్రతి కంటెస్టెంట్ కోసం నియమించబడిన నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా ఓటు చేయవచ్చు. ఓటింగ్ లైన్లు శుక్రవారం రాత్రి 7 గంటల నుండి ఆదివారం ఉదయం 7 గంటల వరకు తెరిచి ఉంటాయి.
అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లు, ఎమోషనల్ మూమెంట్స్ కోసం ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి ట్యూన్ అవ్వండి.