తెలుగు ఇండియన్ ఐడల్ 3 నుంచి కుశాల్ శర్మ ఎలిమినేట్

Must Read

హైదరాబాద్, జూలై 15, 2024 – వీకెండ్ లో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారమైన తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ కుశాల్ శర్మ ఎలిమినేట్ కావడంతో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో కాంపిటేషన్ రసవత్తరంగా మారింది. జూన్ 14, 2024న ప్రారంభమైన ఈ షో ఇప్పుడు కీలకమైన ఎలిమినేషన్ దశలోకి ప్రవేశించింది, ప్రేక్షకుల ఓటింగ్‌తో పాటు న్యాయమూర్తుల స్కోర్‌లు కంటెస్టెంట్స్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేసిన మొదటి ఎలిమినేషన్ రౌండ్లో, ముగ్గురు కంటెస్టెంట్స్-స్కంద, భరత్ రాజ్ కుశాల్ శర్మ- జడ్జిల నుండి తక్కువ స్కోర్లు అందుకుని డేంజర్ జోన్‌లోకి ప్రవేశించారు. తోటి కంటెస్టెంట్స్ భరత్ రాజ్, స్కందతో కుశాల్ తలపడ్డాడు. స్కంద అత్యధిక ఓట్లను పొంది, మొదట సేఫ్ అయ్యారు. కుశాల్, భరత్‌ ఎలిమినేషన్ లోకి వచ్చారు. ఫైనల్ గా ప్రేక్షకుల నుండి తక్కువ ఓట్లు పొందిన కుశాల్ ఎలిమినేట్ అయ్యాడు.

సింగర్ కార్తీక్ నుంచి ప్రేరణ పొందిన కుశాల్, షోలో తన అనుభవాన్ని ‘జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం’ అని చెప్పాడు. అతను ఈ వేదికని దేవాలయంగా, న్యాయనిర్ణేతలను తన మార్గదర్శక వ్యక్తులుగా పేర్కొన్నాడు. తనను ఎంతగానో ప్రోత్సహించిన థమన్‌, గీతా మాధురి, కార్తీక్‌ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.

ఎలిమినేషన్ అయినప్పటికీ, కుశాల్ పాజిటివ్ గా ఉన్నాడు, అతను పోటీ నుండి చాలా నేర్చుకున్నానని, విలువైన అనుభవాలను పొందానని చెప్పాడు. థమన్, కుశాల్ ప్రతిభని గుర్తించాడు, అతన్ని జెన్యూన్ కంటెస్టెంట్ అని అభినందించారు. భవిష్యత్ లో విజయం సాధించాలని ఆకాంక్షించాడు.

కుశాల్‌కు వీడ్కోలు పలికినప్పుడు తోటి కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ఈ ఎలిమినేషన్‌తో, పోటీ తీవ్రమైంది, 11 మందికంటెస్టెంట్స్ ప్రతిష్టాత్మకమైన టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. పెర్ఫార్మెన్స్ కొనసాగుతున్న కొద్దీ, పబ్లిక్ ఓటింగ్ , న్యాయనిర్ణేతల స్కోర్‌ల ఆధారంగా ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు, చివరి వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు అవకాశం ఉంటుంది.

వీక్షకులు తెలుగు ఇండియన్ ఐడల్ విభాగానికి నావిగేట్ చేయడం ద్వారా లేదా ప్రతి కంటెస్టెంట్ కోసం నిర్దేశించిన నంబర్‌లకు మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా లేదా ఆహా యాప్ ద్వారా తమ ఓట్లను వేయవచ్చు. ఓటింగ్ లైన్లు శుక్రవారం నుండి రాత్రి 7 గంటలకు తెరిచి ఉంటాయి. ఆదివారం ఉదయం 7 గంటల వరకు, అభిమానులు తమ వాయిస్ వినిపించేందుకు అనుమతిస్తారు.

ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ మూమెంట్స్ మిస్ కాకుండా చూడండి.

Latest News

విశ్వం చిత్రంలో ప్రతీదీ చాలెంజ్ గా అనిపించింది – కావ్యథాపర్

గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు  శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి....

More News