“బబ్లీ బౌన్సర్” స్క్రిప్ట్ నాకు దక్కటం నా అదృష్టం..పాన్ ఇండియా హీరోయిన్ తమన్నా

సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో బబ్లీ బౌన్సర్”  గ్రాండ్ రిలీజ్

ప్రముఖ యూత్ ఐకాన్ & పాన్ ఇండియా నటి తమన్నా లేడీ బౌన్సర్‌గా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫిలిం “బబ్లీ బౌన్సర్”. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో తమన్నా భాటియాను చూపిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ మరియు జంగిలీ పిక్చర్స్ నిర్మించాయి .ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా

చిత్ర దర్శకుడు మధుర్ భండార్కర్ మాట్లాడుతూ.  హైదరాబాద్ తో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి..నా మొదటి  సినిమా “చాందినిబార్” హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో తియ్యడం జరిగింది.రాము గారితో కలసి రాత్రి, రంగీలా, గాయం, అంతం ,గోవిందా గోవిందా మొదలగు సినిమాలకు వర్క్ చేశాను.మళ్ళీ ఇరవై  మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు రావడం చాలా సంతోషంగా ఉంది..ఈ సినిమా విషయానికి వస్తే నార్త్ సైడ్ లో లేడీ బౌన్సర్ లను చూశాను. ఇక్కడ సౌత్ లో ఉండకపోవచ్చు. వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని  ఈ సినిమా మెదలుపెట్టాను.ఈ సినిమాలో హీరోయిన్ బబ్లీ గా  ఫిజికల్  గా, మెంటల్ గా మెచ్యూరిటీ  చూపించాలి. ఈ విషయంలో తమన్నా ది బెస్ట్ అనిపించింది. “బాహుబలి” లో తమన్నా చేసిన రోల్ ఆమె లోని నటిని బయటకు తీసుకువచ్చింది అనుకుంటాను. ఈ సినిమాకు తమన్నాను ఎందుకు తీసుకున్నావ్ అని ఆడిగారు. ఆలా అడిగిన వారందరూ ఈ ట్రైలర్ చూసిన తరువాత ఫోన్స్ చేసి మీ ఛాయిస్ 100% కరెక్ట్ అని చెప్పారు. మేము అనుకున్నట్టే ఈ సినిమాలో తమన్నా బౌన్సర్ గా చాలా చక్కగా నటించింది. ఈ నెల 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల అవుతున్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు.

నటి తమన్నా  మాట్లాడుతూ.. తెలుగు సినిమా అంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా జర్నీ తెలుగు నుండే సార్ట్ ఆయ్యింది. రాజమౌళి, సుకుమార్ లు అందరూ మన ఇండియన్ రూట్స్ కథలు తీసుకొని చేస్తుంటారు. ఇప్పటికీ  మన ఇండియన్ సినిమాను మన  ఏమోషన్సే నడిపిస్తాయి తొలి సారిగా లేడీ బౌన్సర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ స్క్రిప్ట్ నాకు దొరకడం నా అదృష్టం. .పలు సార్లు జాతీయు అవార్డ్స్ పొందిన  మధుర్ భండార్కర్ సర్ తో చేసే అవకాశం వచ్చిందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో హరియాణాకు చెందిన యువతిగా నటించాను.తప్పకుండా ఈ సినిమా నా కేరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. మధుర్  బండార్కర్ సినిమాలో నటించిన హీరోయిన్స్ కు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ నెల 23న డిస్నీ+ హాట్‌స్టార్‌ లో విడుదల అవుతున్న ఈ సినిమా ను కుటుంబ సమేతం గా  ఇంట్లో కూర్చొని హ్యాపీ గా  చూడండి అన్నారు.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

55 minutes ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago