ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ గా చెప్పుకునే సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’. ఈ సినిమాను సర్వైవల్ థ్రిల్లర్ గా దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ రూపొందించారు. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్ 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందీ సినిమా. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా….ఇక్కడా మంచి వసూళ్లు దక్కించుకుంది.
తాజాగా ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సినిమాను మే 5వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘మంజుమ్మల్ బాయ్స్’ అందుబాటులో ఉండనుంది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల సాహసం ఆధారంగా సినిమా రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘మంజుమ్మల్ బాయ్స్’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ సంచలనం సృష్టించబోతోంది.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…