వినోదాత్మకమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోస్ తో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్న ‘జీ తెలుగు’ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకువస్తూ వారి మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన ‘జీ సూపర్ ఫామిలీ’ షోకి దీటుగా ఇప్పుడు ‘లేడీస్ & జెంటిల్మెన్’ అనే మరో ఎంటర్టైనింగ్ షోని సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనుంది. ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రతివారం ముగ్గురు సరికొత్త సెలబ్రిటీ కపుల్స్ లేదా ఫ్రెండ్షిప్ జోడీలు తరలివచ్చి వీక్షకులను అలరించనున్నారు. అంతేకాదు, ఈ ఆదివారం రెట్టింపు వినోదాన్ని పంచడానికి మరో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ని — ‘F3: ఫన్ & ఫ్రస్ట్రేషన్’ — సాయంత్రం 6 గంటలకు ప్రజల ముందుకు తీసుకురానుంది ‘జీ తెలుగు’.
‘లేడీస్ & జెంటిల్మెన్’ మొదటి ఎపిసోడ్లో భాగంగా సెలబ్రిటీ కపుల్స్ అలీ-జుబేదా, మనో-జాలీమా, మరియు బాబా భాస్కర్-రేవతి మూడు ఫన్నీ రౌండ్లలో తలపడి సందడి చేయనున్నారు. అదేవిధంగా, ఈ సెలబ్రిటీ కపుల్స్ ప్రదీప్ ని పెళ్లి విషయంలో ఏడిపించిన విధానం మరియు అతనికి వారు ఇచ్చిన టిప్స్ అందరిని నవ్వించనున్నాయి.
‘లేడీస్ & జెంటిల్మెన్’ తో 90 నిమిషాల ప్యూర్ ఎంటర్టైన్మెంట్ తరవాత ఈ డోస్ ని మరి కాస్త పెంచుతూ సాయంత్రం 6 గంటలకు ‘F3: ఫన్ & ఫ్రస్ట్రేషన్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ (వెంకీ), వరుణ్ తేజ్ (వరుణ్), తమన్నా భాటియా (హారిక), మరియు మెహ్రీన్ పిర్జాదా (హనీ) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ కుటుంబ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. కథ విషయానికొస్తే, వెంకీ, వరుణ్, హారిక-హనీ & ఫ్యామిలీ ఒక వ్యాపారవేత్తను మోసం చేసి రాత్రికిరాత్రి కోటీశ్వరులు అవ్వాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు. మరి ఆ ప్రయత్నంలో ఎవరు విజయం సాధిస్తారు, ఈ ప్రయాణంలో వారు ఏం తెలుసుకుంటారో తెలియాలంటే ఈ ఆదివారం నాడు ‘F3’ సినిమాను జీ తెలుగులో వీక్షించండి.
సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ‘లేడీస్ & జెంటిల్మెన్’ మరియు సాయంత్రం 6 గంటలకు ‘F3’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ని తప్పక వీక్షించండి, మీ జీ తెలుగులో
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…