రాకింగ్ స్టార్ యాష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణాన్ని నిర్మించబోతున్నారు.

Must Read

ఇప్పటి వరుకు ఎన్ని రామాయణాలు వచ్చిన ఏది కచ్చితమైన రామాయణం అనేది తెలిదు, కాని ఇప్పుడు అసలిన రామాయణాన్ని తియ్యబోతున్నాం అని రెండు నిర్మాణ సంస్థలు ఒకటయ్యాయి. అవే ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్

మంచి విషన్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యాష్ తో కలిసి రామాయణాన్ని నితేష్ తివారి దర్శకత్వంలో, DNEG విశువల్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పటి వరుకు ఎప్పుడు చూడని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ఇస్తామని చెప్పారు.

నమిత్ మల్హోత్ర మాట్లాడుతూ: US, UK, ఇండియా ఇలాంటి దేశాల్లో వ్యాపారాలు చేసి, కమర్షియల్ సక్సెస్ తెచ్చుకుని, ఆస్కార్ వరుకు వెళ్లి, ఇలా నా జీవితం లో నేను చేసిన జర్నీ ప్రకారం ఇప్పుడు నేను మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తియ్యడంలో న్యాయం చెయ్యగలను అని అనిపిస్తుంది. ఎక్కడో కర్ణాటక నుండి ఈరోజు ప్రపంచం గర్వించే KGF 2 వరుకు, యష్ చాలా కష్టపడ్డాడు, ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ను ప్రపంచ వేదిక మీద ప్రెసెంట్ చెయ్యాలి అంటే అది యష్ లాంటి వారితనే సాధ్యం.

యష్ మాట్లాడుతూ: నాకు ఎప్పటి నుండో ఉన్న కల, మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలని, నమిత్ నేను రామాయణం చేస్తే  బాగుంటుంది అని చాలా సార్లు అనుకున్నాం, కాని అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలి అంటే అది మాములు విషయం కాదు, బడ్జెట్స్ కూడా సరిపోవు అందుకే నేను కూడా కో ప్రొడ్యూస్ చెయ్యాలనుకున్నాను. రామాయణానికి నా మనసులో ఒక సుస్థిర స్థానం ఉంది. దాని కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తాను. నితీష్ తివారి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

రామాయణం అనేది మన జీవితాలకు ముడి పది ఉంటుంది, మనం నమ్ముతున్నాం, మనకి రామాయణం తెలుసు, అందులో జ్ఞానం, భావజాలం ఇలా ఎన్నో లేయర్స్ ఉంటాయి. మా విషన్ ఏంటి అంటే గ్లోబల్ స్టేజి మీద ఈ అద్భుతమైన రామయణాన్ని వెండి తేరా మీద చూపించాలి. అందులో ఉన్న ఎమోషన్స్, వాల్యూస్ అన్ని కూడా, రామాయణం యొక్క జర్నీ ని ప్రపంచం అంతా చూపించాలి.

Latest News

Hero Kiran Abbavaram’s “Dilruba” Completes Shooting

Young and talented hero Kiran Abbavaram is starring in the upcoming film Dilruba, with Rukshar Dhillon playing the female...

More News