Categories: న్యూస్

దేవుడు పాత్ర‌లో విక్ట‌రీ వెంటేష్ … దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విశ్వ‌క్ సేన్ ‘ఓరి దేవుడా’ గ్రాండ్ రిలీజ్

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ దేవుడు క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నారంటూ వార్త‌లు వినిపించాయి. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ స్ట‌న్నింగ్ గ్లింప్స్‌తో అధికారికంగా ధృవీక‌రించారు.

ఈ ప్ర‌క‌ట‌న అంద‌రిలోనూ ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచింది. గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. వెంక‌టేష్ కూల్‌, స్టైలిష్ లుక్ క‌న‌ప‌డే దేవుడు క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతుంది. చుట్టూ పుస్త‌కాలు.. సీతాకోక చిలుక‌లు మ‌ధ్య విశ్వ‌క్ సేన్ క‌నిపించారు. విక్ట‌రీ వెంక‌టేష్ అంటే ఓ మేన‌రిజ‌మ్ ఉంటుంది. ఆ మేన‌రిజ‌మ్‌తో ఆయ‌న ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌కు గ్లింప్స్ చివ‌ర‌లో స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఓరి దేవుడా’ దేవుడా చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌టం డ‌బుల్ స‌ర్‌ప్రైజ్. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు.  పివిపి సినిమా బ్యాన‌ర్స్‌పై ప్ర‌సాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 ఓరి దేవుడా’ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాశారు. విజ‌య్ ఈ చిత్రాన్ని ఎడిట‌ర్‌గా, విదు అయ్య‌న్న సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Tfja Team

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

3 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

3 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

4 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

4 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

4 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

6 days ago