చియాన్ విక్రమ్ కధానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. తాజాగా ‘కోబ్రా’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
”హి ఈజ్ ఏ కోబ్రా. రకరకాలుగా రూపం మార్చుకొని వెళ్ళడం తెలుసు. చాటుగా మాటేసి కాటేయడమూ తెలుసు.” అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్.. హైవోల్టేజ్ యాక్షన్, విక్రమ్ రకరకాల అవతారాలు, నట విశ్వరూపంతో మైండ్ బ్లోయింగ్ అనిపించింది. తన జీవితంలోని ప్రతి ఒక్క సెకను అంకెలను పీల్చుకునే, ప్రతి సమస్యకు గణితశాస్త్రంలో పరిష్కారం కనుగొని, దేశ విదేశాలు తిరుగుతూ, గణితశాస్త్రన్ని వుపయోగించి నేరాలు పాల్పడిన మేధావి కోబ్రా పాత్రలో విక్రమ్ పెర్ఫార్మమెన్స్ బ్రిలియంట్ గా వుంది.
ఈ చిత్రంతో సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్న భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంతుచిక్కని కోబ్రా కోసం వేటలో ఉన్న పోలీసుగా కనిపించారు. శ్రీనిధి శెట్టి విక్రమ్ ప్రేయసిగా కనిపించగా, రోషన్ మాథ్యూ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించాడు.
విక్రమ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో పాటు వైబ్రెంట్ విజువల్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రానికి బిగ అసెట్స్ గా నిలిచాయి. ట్రైలర్ కి ఏఆర్ రెహమాన్ అందించిన నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో వుంది. హరీష్ కన్నన్ కెమెరా పనితనం రిచ్ గా వుంది.
ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఆగస్ట్ 31న విడుదలౌతుంది.
తారాగణం: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు.
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ఆర్ అజయ్ జ్ఞానముత్తు
నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్
బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
విడుదల: ఎన్వీఆర్ సినిమా (ఎన్వీ ప్రసాద్)
సంగీతం: ఏఆర్ రెహమాన్
డీవోపీ: హరీష్ కన్నన్
ఎడిటర్: భువన్ శ్రీనివాసన్
పీఆర్వో: వంశీ-శేఖర్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…