వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.
కృష్ణ వ్రింద విహారి లోని తార నా తార పాట విడుదల అయింది. నాగ శౌర్య , షిర్లీ సెటియాల అందమైన కెమిస్ట్రీ ని చూపించే మెస్మెరిజింగ్ నెంబర్ స్వరపరిచారు మహతి. లీడ్ పెయిర్ బైక్ రైడ్ కివెళ్ళడం, షిర్లీ కౌగలించుకున్నపుడు శౌర్య మదురమైన అనుభూతిని పొందడం, ప్రేమికులిద్దరూ వెచ్చని రాత్రిలో హాయిగా విహరించడం లవ్లీగా వుంది. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం యూత్‌ఫుల్ గా ఉంది. నకాష్ అజీజ్ పాటని బ్రిలియంట్ గా పాడారు.
అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.
‘కృష్ణ వ్రింద విహారి’ సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.
తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: అనీష్ ఆర్. కృష్ణ
నిర్మాత: ఉషా ముల్పూరి
సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి
బ్యానర్: ఐరా క్రియేషన్స్
సంగీతం: మహతి స్వరసాగర్
డివోపీ: సాయిశ్రీరామ్
సహ నిర్మాత: బుజ్జి
ఎడిటర్ – తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ – రామ్ కుమార్
డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్
పీఆర్వో: వంశీ, శేఖర్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…