శర్వానంద్, శ్రీ కార్తీక్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘ఒకే ఒక జీవితం’ నుండి హీరో కార్తీ ఫీచర్డ్ ‘మారిపోయే’ ప్రమోషనల్ సాంగ్ విడుదల

Must Read

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.

Maaripoye Song (Telugu) Feat: Karthi, Travis King | Sharwa, Ritu | Jakes Bejoy | Oke Oka Jeevitham

మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటివలే విడుదలైన ”ఒకటే కదా” పాట సూపర్ హిట్ అయ్యింది. అన్నీ మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ పై ట్రెండింగ్ లో నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుండి ”మారిపోయే” అనే పాటని విడుదల చేశారు. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే స్టార్ హీరో కార్తీ స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపించి, స్వయంగా ఆయనే పాడి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. ‘నేనే పాడుతున్నా” అంటూ తనదైన శైలిలో అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు కార్తీ.

జేక్స్ బిజోయ్ ఈ పాట కోసం ట్రెండీ క్యాచి ట్యూన్ ని కంపోజ్ చేయగా, పాటకు కృష్ణచైతన్య  అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ముఖ్యంగా కార్తి ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడిన విధానం ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు సర్ ప్రైజ్ లు ఉంటానని చిత్ర యూనిట్ ఇంతకుముందే చెప్పింది. చెప్పినట్లే కార్తి పాటతో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. అమ్మ పాట, ఒకటే కదా పాటలు ట్రెండింగ్ లో వుండగా.. ఇప్పుడు విడుదలైన కార్తీ  ప్రమోషనల్ సాంగ్ మరింత జోష్ ని ఇచ్చింది.

సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ గా,  శ్రీజిత్ సారంగ్ ఎడిటర్ గా, సతీష్ కుమార్ ఆర్ట్  డైరెక్టర్ గా పని చేస్తున్నారు.  తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు.

Karthi Sivakumar at Nenjil Thunivirunthal Audio Launch

ఈ చిత్రం తమిళంలో ‘కణం’ పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది.

నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

రచన,  దర్శకత్వం: శ్రీ కార్తీక్
నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు
నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
డీవోపీ: సుజిత్ సారంగ్
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
ఆర్ట్ డైరెక్టర్: ఎన్.సతీష్ కుమార్
స్టంట్స్: సుదేష్ కుమార్
స్టైలిస్ట్: పల్లవి సింగ్
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య
పీఆర్వో : వంశీ-శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News