*కమర్షియల్ హంగులతో “నేను మీకు బాగా కావాల్సినవాడిని” ట్రైలర్*
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్ హీరోగా ఇప్పుడు “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకు ఎస్‌ఆర్ కల్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మూవీ టీం.రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్నట్లు అర్ధమవుతుంది. కిరణ్ మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. కిరణ్ ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.వి కృష్ణారెడ్డి ఈ సినిమాలో కనిపిస్తున్నారు. కిరణ్ అబ్బవరం తో పాటు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా కనిపించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటించింది.
ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా, ఈ నెల 16న విడుదల కానుంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…