పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఈరోజు(సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ‘పవర్ గ్లాన్స్’ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన ‘పవర్ గ్లాన్స్’ ఈ చిత్రంపై అంచనాలను ఎన్నో రేట్లు పెంచేలా ఉంది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ”హరిహర వీరమల్లు” సినిమా రూపొంద నుండటంతో చిత్రం పై అంచనాలూ అధికంగానే ఉన్నాయి. ఈ ప్రచార చిత్రంలో వీరమల్లుగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ అత్యున్నత స్థాయిలో ఉంది. మీసం తిప్పి, కదన రంగంలో అడుగుపెట్టి, మల్ల యోధులను మట్టి కరిపిస్తూ శక్తివంతమైన యోధుడు గా దర్శనమిచ్చారు పవర్ స్టార్. ఇక ఆయన తొడగొట్టే షాట్ అయితే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఎప్పటిలాగే ప్రశంసనీయం.
‘పవర్ గ్లాన్స్’ని బట్టి చూస్తే అద్భుతమైన కథ, అత్యద్భుతమైన విజువల్స్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్నో ఫ్యాన్‌బాయ్ మూమెంట్స్ ఉండనున్నాయని అర్థమవుతోంది. అభిమానులు తమ ఆరాధ్య నటుడు పుట్టినరోజును జరుపుకుంటున్న సమయంలో విడుదలైన ఈ పవర్ గ్లాన్స్ వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఉంది. యాక్షన్, గ్రాండియర్, హీరోయిజం, కంటెంట్ మరియు క్లాస్ ఇలా అన్నింటితో కలిసి ఓ పవర్-ప్యాక్డ్ ఫిల్మ్ లా వస్తున్న ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…