Categories: న్యూస్

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌శంస‌లందుకున్న పంచ‌తంత్ర క‌థ‌లు

మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మించిన చిత్రం పంచ‌తంత్ర క‌థ‌లు. నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, నిహాల్ కోద‌ర్తి, అజ‌య్ క‌తుర్వ‌ర్, గీతా భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, సాదియ‌ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఐదు క‌థ‌ల స‌మాహారంగా రూపొందిన ఈ చిత్రం ద్వారా గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం మ‌న తెలుగు ఓటీటీ అయిన ఆహాలో విశేష ఆద‌ర‌ణతో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ఈ చిత్రాన్ని ప్ర‌శంసించారు. తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఈ సినిమా వీక్షించారు. ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ – ఈ మధ్య ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న పంచతంత్ర కథలు చూశాను. దాని గురించి ఐదు మాటల్లో చెబుతాను. దర్శకుడు, కెమెరామేన్‌ ఒకరే కనుక చాలా అద్భుతమైన చిత్రీకరణ జరిగింది. మంచి, మంచిలొకేషన్స్, మంచి మ్యూజిక్, మంచి మాటలు, మంచి సెలక్షన్‌ ఆఫ్‌ ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కుదిరింది. రెండోవది...కులవ్యవస్థ గురించి, పెద్ద కులం, చిన్న కులం కాకుండా...ప్రేమకు కులాలు అడ్డురావు అనే అంశాన్ని చాలా సున్నితంగా, ఎక్కువ మెలో డ్రామా లేకుండా చాలా చక్కగా తీశాడు. నటీనటులు కూడా చాలా చక్కగా చేశారు. కచ్చితంగా చూడాల్సిన ఎపిసోడ్‌ ఇది. మూడోపాయింట్‌..అహల్య అనే మరో షార్ట్‌ స్టోరీలో..తన బిడ్డను పోషించుకోవడం కోసం వ్యభిచారిణిగా మారిన అమ్మాయి, పెయింటర్‌ మధ్య జరిగే ఎపిసోడ్‌ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అందులో హీరో హీరోయిన్‌ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. హృదయానికి హత్తుకునేలా చిన్న చిన్న మాట‌ల‌తో చాలా చ‌క్క‌గా చిత్రీకరించాడు ద‌ర్శ‌కుడు. నాలుగ‌వ పాయంట్‌.. త‌రుణ్ భాస్క‌ర్ త‌ల్లి గీతా భాస్క‌ర్‌గారు ఇద్ద‌రు కొడుకులు ఉండ‌డంతో ఏ ఇంట్లో ఉండాలి అనే విష‌యం ఎంతో సున్నితంగా..ఎంతో ఆలోచింప‌జేసే విధంగా తీశారు. గీత భాస్క‌ర్ గారు చాలా నేచుర‌ల్‌గా చేశారు. పంచ‌తంత్ర క‌థ‌లు అని పేరు పెట్టినందుకు ఐదు చ‌క్క‌టి క‌థ‌ల్ని క‌మ‌ర్షియాలిటీ లేదేంటి?.. ఫైట్లు గ‌ట్రా లేవేంటి? అనే ఆలోచ‌న లేకుండా నిర్మించిన నిర్మాత మ‌ధుకి ఈ సినిమా మ‌రింత మంచి విజ‌యం సాధించి మునుముందు ఇంకా మంచి సినిమాలు తీయాల‌ని కోరుకుంటున్నా..అలాగే ద‌ర్శ‌కుడు శేఖ‌ర్‌, మిగ‌తా ఆర్టిస్టుల‌కి కూడా మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు పంచ‌తంత్ర క‌థ‌లు టీమ్‌ అన్నారు.

తారాగ‌ణం: నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
నిర్మాణ సంస్థ‌: మ‌ధు క్రియేష‌న్స్‌
నిర్మాత‌: డి. మ‌ధు
ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: గంగ‌న‌మోని శేఖ‌ర్‌
సంగీతం: క‌మ్రాన్‌
కో ప్రొడ్యూస‌ర్‌: డి. ర‌వీంద‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పాల‌కూరి సాయికుమార్‌
మాట‌లు, లైన్ ప్రొడ్యూస‌ర్‌: అజ‌ర్ షేక్‌
సినిమాటోగ్ర‌ఫి: గంగ‌న‌మోని శేఖ‌ర్‌, విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల‌
ఎడిట‌ర్‌: శ్రీ‌నివాస్ వ‌ర‌గంటి
కాస్టూమ్ డిజైన‌ర్, స్టైలిస్ట్‌: రితీషా రెడ్డి
సౌండ్ డిజైన‌ర్‌: నాగార్జున తాళ్ల‌ప‌ల్లి
లిరిక్స్‌: సుద్దాల అశోక్ తేజ‌, కాస‌ర్ల శ్యాం, మామా సింగ్‌
పిఆర్ఓ: శ్రీను దుద్ది, సిద్ధు

Tfja Team

Recent Posts

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి…

12 hours ago

‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది – సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వంశీ నందిపాటి..!

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…

12 hours ago

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

1 day ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

1 day ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

1 day ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

1 day ago