దర్శకుడు మేర్లపాక గాంధీ హిలేరియస్ ఎంటర్ టైనర్ లను డీల్ చేయడంలో దిట్ట. ఆయన తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కంప్లీట్ ఎంటర్ టైనర్. దీంతో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. సంతోష్ సూపర్‌హిట్ ‘ఏక్ మినీ కథ’ కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే.
తాజాగా లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ టీజర్ ను హీరో నితిన్ లాంచ్ చేశారు. సంతోష్ శోభన్ తన స్నేహితుడైన కెమెరామెన్ నెల్లూరు సుదర్శన్‌తో కలిసి అందమైన ప్రదేశాలకు ప్రయాణించి ట్రావెల్ బ్లాగర్ గా మారాలనుకుంటున్నాడు. సంతోష్ ప్రయాణంలో అందమైన అమ్మాయి ఫరియా అబ్దుల్లాను కలుస్తాడు. ఆమెను ఫ్లిర్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు. హిలేరియస్ గా సాగుతున్న టీజర్ సెకండాఫ్‌లో సినిమా క్రైమ్ పార్ట్ చూపించడం క్యురియాసిటీని పెంచింది.
క్రైమ్, కామెడీ చాలా ఎక్సయిటింగ్ కాంబినేషన్. టీజర్ ప్రామిసింగ్ గా వుంది. మేర్లపాక గాంధీ రొమాన్స్ తో పాటు క్రైమ్, కామెడీ అంశాలను కలిగి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
పక్కింటి అబ్బాయిలా కనిపించిన సంతోష్ శోభన్ కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంది. టీజర్‌లో ఫరియా అబ్దుల్లా అందంగా కనిపించింది. నెల్లూరు సుదర్శన్‌ది సంతోష్ తో పాటు ప్రయాణించే కీలక పాత్ర. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫన్నీగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా అలరించిన టీజర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది.
బ్లాక్ బస్టర్ హిట్ ‘శ్యామ్ సింగరాయ్’ ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్ టైన్‌మెంట్స్ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
నవంబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుందని మేకర్స్ ట్రైలర్ ద్వారా తెలియజేశారు.
తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
డీవోపీ: వసంత్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో: వంశీ-శేఖర్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…