న్యూస్

విజ‌య‌నిర్మల మ‌న‌వ‌డు శరణ్ `మిస్టర్ కింగ్` గ్రాండ్ గా టీజర్ లాంచ్

విజ‌య నిర్మల గారి మ‌న‌వుడు శరణ్ కుమార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సీనియ‌ర్ న‌రేశ్ అల్లుడు (న‌రేశ్ క‌జిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ ప‌తాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్  అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది.  

టీజర్ లాంచ్ ఈవెంట్ లో శరణ్ కుమార్ మాట్లాడుతూ.. `మిస్టర్ కింగ్` నుండి విడుదలైన నేనెరుగని దారేదో పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ లాంచ్ చేస్తున్నాం. లాక్ డౌన్  ఛాలెంజింగ్ సమయంలో ఒక సవాల్ తీసుకొని ఈ సినిమాని చేశాం. శశిధర్ చాలా అద్భుతమైన కథ చేశారు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమాని తెరకెక్కించారు. మణిశర్మ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాని పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. మీ అందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది” అన్నారు.

దర్శకుడు శశిధర్  మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ప్రధాన బలం మా నిర్మాత. మంచి టీం ఇచ్చి ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. ఇంతమంచి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. సినిమా పట్ల విజన్ వున్న నిర్మాత. ఆయన మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. శరణ్ తన తొలి సినిమాని చాలా అద్భుతంగా చేశారు. అలాగే మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. శరణ్ కుమార్ తండ్రి పాత్రలో రియల్ ఫాదర్  రాజ్‌కుమార్ గారు చక్కగా చేశారు. హీరోయిన్స్ నిష్కల ఊర్వశి అద్భుతంగా చేశారు. డివోపీ తన్వీర్ తో పాటు మిగతా నటీనటులు సాంకేతిక నిపుణులు బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. పీఆర్వో వంశీ శేఖర్ గారు మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. త్వరలోనే సినిమాని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాని అందరూ థియేటర్లో చూడాలి” అని కోరారు.

నిర్మాత బి.ఎన్.రావు మాట్లాడుతూ.. దర్శకుడు శశిధర్ మాకు ఎప్పటి నుండో పరిచయం. మంచి కథ చెప్పి ఇందులో కృష్ణ గారి కుటుంబంలోని శరణ్ హీరో అనేసరికి ఇంకేం అలోచంచలేదు. సినిమాని ఎక్కడా రాజీ పడకుండా తీయమని చెప్పాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది” అన్నారు

రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మా కుటుంబం అంతా సినిమాల్లో  వున్నప్పటికీ నేను మాత్రం ఎప్పుడూ నటించలేదు. దర్శకుడు శశిధర్ తండ్రి పాత్రని నేను చేస్తే బావుటుందని శిక్షణ ఇప్పించి మరీ చక్కగా నటింపజేశారు. శరణ్ ని ఇంత మంచి కథతో సినిమాని ఇచ్చిన దర్శక నిర్మాతలకు, మణిశర్మ గారికి, డివోపీ తన్వీర్ కి కృతజ్ఞతలు. ఈ సినిమాని ప్రేక్షకుల ఆదరించి శరణ్ కి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను.  

నటుడు రోషన్ మాట్లాడుతూ.. ఇందులో మిస్టర్ కింగ్ ఫ్రండ్ గా కనిపిస్తా. దర్శకుడు శశిధర్ అద్భుతంగా తీశారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలని వుంది” కోరారు.

డీవోపీ తన్వీర్ మాట్లాడుతూ.. `మిస్టర్ కింగ్`చాలా మంచి కథ. మంచి టీంతో కలసి పని చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. సినిమాని థియేటర్ లో చూడాలి” అని కోరారు.

సుధాకర్ మాట్లాడుతూ.. మిస్టర్ కింగ్ కథ దర్శకుడు చెప్పినపుడు చాలా నచ్చింది. చాలా వైవిధ్యమైన కథతో వస్తున్నాడు శరణ్. చాలా పెద్ద కుటుంబం నుండి వచ్చిన ఎంతో ఒద్దికగా వుంటారు శరణ్. సినిమాని చాలా ఉన్నతంగా చేశాం. మణిశర్మ గారు అద్భుతమైన సంగీతం అందించారు. `మిస్టర్ కింగ్` శరణ్ కి కింగ్ లాంటి సినిమా అవుతుందని ” కోరుకున్నారు.

రవి కిరణ్ మాట్లాడుతూ.. హన్విక క్రియేషన్స్ ఈ సినిమా ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుంది” అన్నారు

సూర్య కిరణ్ మాట్లాడుతూ.. కింగ్ సినిమా శరణ్ కుమార్ కి మంచి విజయం ఇస్తుందనే నమ్మకం వుంది. దర్శకుడు సినిమాని అద్భుతంగా వుంది. టీజర్ చూసి షాక్ అయ్యా,. చాలా బ్రిలియంట్ గా వుంది. సినిమా ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుంది” అన్నారు

సాగర్ మాట్లాడుతూ.. కృష్ణ గారి కుటుంబంతో నాకు మంచి అనుబంధం వుంది. శరణ్ కుమార్ కింగ్ సినిమాతో కింగ్ లా నిలబడాలని, సినిమా మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.

అంజలి మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది. `మిస్టర్ కింగ్` చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం వుంది. సినిమా దర్శకుడు శశిధర్ కి చాలా గ్రేట్ విజన్ వుంది. తప్పకుండా పెద్ద దర్శకుడు అవుతాడు. ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు” తెలిపారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

17 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago