Categories: న్యూస్

బ్రేక్ అవుట్ ట్రైలర్ ని లాంచ్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

అనిల్ మోదుగ ఫిలిమ్స్ బ్యానర్ పై దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం గారి తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ నిర్మిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్ ‘ బ్రేక్ అవుట్’. బాల కృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల సహా నిర్మాతలు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. వైవిధ్యమైన కథాంశం రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు.

రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లో ఈ చిత్ర కథాంశాన్ని చాలా ఇంటరెస్టింగా రివిల్ చేశాడు దర్శకుడు. హీరో అనుకోని పరిస్థితిలో వంటరిగా ఒక గ్యారేజ్ లో చిక్కుకుపోతాడు. అతనికి మోనో ఫోబియా అనే మానసిక రుగ్మత వుంటుంది. ఈ ఫోబియా వున్న వారికి వంటరిగా గడపడం అంటే తీవ్ర ఆందోళనకరంగా వుంటుంది. గ్యారేజ్ లో వంటరిగా చిక్కుకున్న హీరో అక్కడి నుండి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? మోనో ఫోబియాతో హీరో ఎలాంటి సవాళ్ళని ఎదురుకున్నాడనేది ట్రైలర్ లో బ్రిలియంట్ గా ప్రజంట్ చేశారు .

ట్రైలర్ లో రాజా గౌతమ్ ఫెర్ఫామెన్స్ టెర్రిఫిక్ గా వుంది. అతని లుక్, మేకోవర్ ఆకట్టుకున్నాయి. సాంకేతికంగా ట్రైలర్ ఉన్నతంగా వుంది. జోన్స్ రూపర్ట్ అందించిన నేపధ్య సంగీతం ట్రైలర్ మరో ఆకర్షణగా నిలిచింది. మోహన్ చారీ కెమరాపనితనం ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది.

చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోహిస్తున్నారు.

నటీనటులు ; రాజా గౌతమ్, చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి

టెక్నికల్ టీమ్ :
రచన, దర్శకత్వం : సుబ్బు చెరుకూరి
బ్యానర్ : అనిల్ మోదుగ ఫిలిమ్స్
నిర్మాత : అనిల్ మోదుగ
సహా నిర్మాతలు : బాల కృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల
సినిమాటోగ్రఫీ : మోహన్ చారీ
సంగీతం : జోన్స్ రూపర్ట్
పీఆర్వో : తేజస్వీ సజ్జ

Tfja Team

Recent Posts

బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” ఫస్ట్ లుక్

జెనీషా ఏ వన్ మూవీ పతాకంపై సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్ , ప్రాచీ థాకర్,…

9 hours ago

త్వరలో ప్రముఖ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు రాబోతున్న సెన్సేషనల్ సై – ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”

థియేట్రికల్ గా 2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన "కిల్లర్" సినిమా ఫ్యాన్సీ ప్రైస్ కు "కిల్లర్" సినిమా…

9 hours ago

ఒక్కడే అందరినీ ఎదుర్కొంటే.. ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’తో వస్తున్న మనోజ్ బాజ్‌పాయ్, దివ్య దత్తా, బోమన్ ఇరానీ

అభివృద్ధి చెందుతోన్న నగరంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత మారినా కూడా కొన్నింటిని వదులుకోవడం మాత్రం అంత…

9 hours ago

మిమ్మల్ని గౌరవించిన చిత్ర పరిశ్రమలను మీరు గౌరవించండి – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్..!!

ఇటీవల కొందరు నాయికలు తెలుగు చిత్ర పరిశ్రమను, దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీని విమర్శిస్తూ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్ గా…

9 hours ago

నటుడు నితిన్ నార్ణే భుజం సర్జరీ విజయవంతం..!

ప్రముఖ నటుడు నితిన్ నార్ణే ఇటీవల సినిమా షూటింగ్‌లో కుడి భుజానికి గాయమవడంతో, November 4న కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో…

9 hours ago

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేసిన కింగ్ నాగార్జున ప్రజెంట్స్, అనీష్, అనస్వర రాజన్ ‘ఇట్లు అర్జున’ స్టైలిష్ లవ్ స్టోరీ, థ్రిల్, కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ ట్రైలర్‌

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంతో కొత్త హీరో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ ఉప్పల…

9 hours ago