Categories: న్యూస్

‘స్పార్క్’.. ప్రతి నాయ‌కుడిగా గురు సోమ సుందరం

విక్రాంత్ హీరోగా ప‌రిచ‌య‌మవుతున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్‌ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ అన్‌కాంప్రైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తోంది. అనౌన్స్‌మెంట్ రోజునే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ మూవీలో టాలెంటెడ్ యాక్ట‌ర్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమ‌సుంద‌రం విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

అరవింద్‌ కుమార్‌ రవి వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి వర్మ ఇంతకు మునుపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు కాబట్టి సినిమాటోగ్రఫీని కూడా హ్యాండిల్‌ చేస్తున్నారు.

‘ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అక్టోబ‌ర్ 3 నుంచి ఐస్‌ల్యాండ్‌లో షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత మున్నార్‌, వైజాగ్‌ల్లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నాం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని సార‌థి స్టూడియోలో వేసిన రెండు భారీ సెట్స్‌లో షూటింగ్ జ‌రుగుతోంది’ అని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

‘హృద‌యం’ ఫేమ్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ సినిమాకు ట్యూన్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది స్పార్క్. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కీ రోల్స్ కోసం రీసెంట్‌గా వెర్సటైల్ ఆర్టిస్ట్ నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం జాయిన్ అయ్యారు. వీరితో పాటు వెన్నెల కిశోర్, షాయాజీ షిండే, సత్య, శ్రీకాంత్‌, కిరణ్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago