ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ 2 ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశమంతా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతున్నాయి. క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. శ్రీ కృష్ణుడి నేపథ్యంలో వచ్చిన కార్తికేయ 2 సినిమాకు హిందీలోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి.
తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ కార్తికేయ 2 సినిమా యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత మంచి సందేశాన్ని దేశమంతా చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రత్యేకంగా గుజరాత్ సిఎంను కలిసారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 100 కోట్లకు పైగా వసూలు చేసి ఎపిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…